PAK vs NZ | బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో మరో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. సెమీఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. నెదర్లాండ్స్‌పై అఫ్గానిస్థాన్ విజయం సాధించడంతో.. పాకిస్థాన్ ముందంజ వేయడం మరింత కష్టంగా మారిన తరుణంలో ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో నెగ్గి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పాటు రన్‌రేట్ మెరుగు పర్చుకోవాలని పాక్ భావిస్తున్నది. మరోవైపు న్యూజిలాండ్ గాయాలతో సతమతమవుతున్నది.
రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు నీషమ్, చాప్మన్, హెన్రీ సేవలను ఆ జట్టు కోల్పోయింది. గత మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న కివీస్.. పాక్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరం. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింట నెగ్గిన న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంటే.. మూడు గెలిచిన పాకిస్థాన్ ఆరో ప్లేస్‌లో ఉంది.