Usman Shinwari | ఆరేళ్లలో 34 మ్యాచ్‌లు.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పేసర్..!
Usman Shinwari : పాకిస్థాన్ పేసర్ ఉస్మాన్ షిన్వారీ (Usman Shinwari) వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ఈ స్పీడ్‌స్టర్ ప్రకటించాడు.
Usman Shinwari : పాకిస్థాన్ పేసర్ ఉస్మాన్ షిన్వారీ (Usman Shinwari) వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ఈ స్పీడ్‌స్టర్ ప్రకటించాడు. 19 ఏళ్లకే సెలక్టర్ల దృష్టిలో పడిన ఉస్మాన్.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం పెద్దగా రాణించలేదు. గాయాలతో సతమతమైన అతడు ఆరేళ్ల కెరీర్లో 34 మ్యాచులు మాత్రమే ఆడాడు. చివరిసారిగా అతడు పాకిస్థాన్ నేషన్స్ టీ20 కప్‌లో బరిలోకి దిగాడు. అయితే.. నాలుగు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓవైపు గాయాలు.. మరోవైపు జట్టులో స్థానంకై పోటీ పెరగడంతో కెరీర్ ముగించడమే సరైందిగా 31 ఏళ్ల ఉస్మాన్ భావించాడు.
‘అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అయితే.. యువతరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇకపై ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతాను. అభిమాను మద్దతు, వారి ప్రేమ నాకెంతో విలువైనవి’ అని ఉస్మాన్ వెల్లడించాడు.
— Usman khan shinwari (@Usmanshinwari6) September 9, 2025
దేశవాళీ క్రికెట్లో సంచలన బౌలింగ్‌తో వార్తల్లో నిలిచిన ఉస్మాన్ 19 ఏళ్లకే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2013 డిసెంబర్లో శ్రీలంకతో మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే.. వెన్నెముకకు గాయంతో ఉస్మాన్ కెరీర్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కోలుకున్నా సరే ఆరేళ్లకు రావల్పిండిలో లంకపైనే తొలి టెస్టు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికవ్వలేదు. 2013 నుంచి 2019 వరకూ దేశానికి ప్రాతినిధ్యం వహించాడీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. పాక్ జెర్సీతో ఒకే ఒక టెస్టు, 17 వన్డేలు, 16 టీ20లు ఆడాడంతే.
Usman Shinwari, the 31-year-old left-arm fast bowler, has announced his retirement from international cricket
It was in ODIs that Shinwari was at his best when in 2019 he became the first bowler to take an international five-for in Pakistan since 2009
Full story:… pic.twitter.com/KGj4k0WJUp
— ESPNcricinfo (@ESPNcricinfo) September 9, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

