సుశీల్‌కు ప్రాణహాని!

న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అందుకే అతడిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అపారమైన కీర్తిప్రతిష్ఠలు సాధించినా.. చెడు సాహవాసాల వల్ల దారితప్పిన సుశీల్‌కు తన పాత మిత్రులతోనే ప్రాణహాని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడి.. సుశీల్‌పై పగబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో కాలా జఠేడితో సంబంధాలు కొనసాగించిన సుశీల్.. అతడి సమీప బంధువైన సాగర్ రాణా తనపై బురదజల్లుతున్నాడనే అనుమానంతోనే హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కాలా జఠేడి.. సుశీల్‌కు హాని చేయొచ్చని అనుమానిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

