మెల్టోర్న్: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న అరుదైన రికార్డు సాధించాడు. వయసు కేవలం అంకె అని నిరూపిస్తూ..పురుషుల డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న ఎక్కువ(43 ఏండ్లు) వయస్సు ప్లేయర్‌గా బోపన్న రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రాజీవ్‌రామ్(38 ఏండ్లు) ఫీట్‌ను బోపన్న తిరుగరాశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా రోహన్ ఈ రికార్డు అందుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 6-4, 7-6(7/5) తేడాతో మాక్సిమో గోంజాలెజ్, అండ్రెస్ మోల్టెని(అర్జెంటీనా) ద్వయంపై గెలిచి సెమీస్ చేరింది. గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన బోపన్న అత్యధిక వయసు కల్గిన ప్లేయర్‌గా నిలువగా, ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో అడుగుదూరంలో నిలిచాడు.
అల్కరాజ్ ఔట్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫెవరేట్ కార్లోస్ అల్కరాజ్కు షాక్ తగిలింది. హోరాహోరీగా సాగిన పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) 6-1, 6-3, 6-7(2/7), 6-4తో అల్కరాజ్ను ఓడించి సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. మరో క్వార్టర్స్‌లో డానియెల్ మెద్వదెవ్ (రష్యా) 7-6(7/4), 2-6, 6-3, 5-7, 6-4తో హుబెర్ట్ హుర్కాజ్(పోలండ్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో జెంగ్ 6-7(4/7), 6-3, 6-1తో కలిన్స్కేయాపై, యాస్ట్రేమెస్కా 6-3, 6-4తో నోస్కోవాపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు.