ODI World Cup | టాస్ గెలిచిన అఫ్గాన్.. నిలకడగా ఆడుతున్న కివీస్
ODI World Cup | గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ నేడు చెన్నై వేదికగా 16వ లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతున్నది.
ODI World Cup | గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ నేడు చెన్నై వేదికగా 16వ లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతున్నది. స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు కలిగిన అఫ్గానిస్తాన్.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అఫ్గాన్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగగా కివీస్ మాత్రం ఆ జట్టు రెగ్యులర్ సారథి కేన్ విలియమ్సన్ స్థానంలో విల్ యంగ్‌ను బరిలోకి దించింది. కేన్ మామ గైర్హాజరీలో కివీస్‌ను టామ్ లాథమ్ నడిపిస్తున్నాడు.
స్పిన్‌కు అనుకూలించే పిచ్ పై అఫ్గాన్ సారథి హష్మతుల్లా షాహిది టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవడంతో పాటు తొలి ఓవర్‌నే యువ స్పిన్నర్ ముజీబ్‌తో వేయించాడు. విల్ యంగ్‌తో పాటు కలిసి క్రీజులోకి వచ్చిన కాన్వే.. అఫ్గాన్ యువసంచలనాన్ని ఎదుర్కునేందుకు తడబడ్డాడు. తడబడుతూనే బ్యాటింగ్ చేసిన కాన్వే.. చివరికి 18 బంతులాడి 3 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి ముజీవ్ వేసిన ఏడో ఓవర్లో మూడో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 30 పరుగులకే కివీస్ కీలక వికెట్‌ను కోల్పోయింది.
కాన్వే నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్రతో కలిసి ఓపెనర్ విల్ యంగ్ కివీస్ స్కోరుబోర్డును ముందుకునడిపిస్తున్నాడు. ఈ ఇద్దరూ అఫ్గాన్ పేస్‌తో పాటు స్పిన్ దళాన్ని ఎదుర్కుంటున్నారు. 15 ఓవర్ల ఆట ముగిసే సమయానికి కివీస్ ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. విల్ యంగ్ (48 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (15 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

