Ind vs Afg | తొలి వికెట్ కోల్పోయిన అఫ్ఘానిస్థాన్.. స్కోరు ఎంతంటే?
ODI World Cup | వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా.. ఢిల్లీ వేదికగా నేడు భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్‌కు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు.
ODI World Cup: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా.. ఢిల్లీ వేదికగా నేడు భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్‌కు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు.
అఫ్ఘానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(22)ను బుమ్రా ఔట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. దీంతో అఫ్ఘానిస్థాన్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్ జట్టు 7.3 ఓవర్లకు 33 పరుగులు చేసింది. క్రీజులో రహ్మానుల్లా గుర్బాజ్(10), రహమత్ షా(0) ఉన్నారు.
CWC2023. WICKET! 6.4: Ibrahim Zadran 22(28) ct K L Rahul b Jasprit Bumrah, Afghanistan 32/1 https://t.co/Oj9O7Gq852 #INDvAFG #CWC23
— BCCI (@BCCI) October 11, 2023
కాగా, ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. ఇవాళ జరిగేది 9వ మ్యాచ్. ఆడిన రెండేసి మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు నాలుగేసి పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి రెండేసి పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, బంగ్లాదేశ్ టీమ్‌లు ఒక్కో విజయం, ఒక్కో ఓటమితో రెండేసి పాయింట్లు సాధించి ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్ ఆడిన ఒక్కో మ్యాచ్ ఓడిపోయి.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఓడిపోయి ఇంకా ఖాతా తెరువలేదు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

