NZ vs PAK: కివీస్-పాక్ పోరులో వర్షం దోబూచులాట.. అదే జరిగితే పాక్ కే విజయావకాశాలు
NZ vs PAK: ఆట మొదలై నాలుగు ఓవర్లు పూర్తిగా పడకముందే మళ్లీ వర్షం మొదలవడంతో ఆట ఆగిపోయింది. ఆట నిలిచే సమయానికి పాకిస్తాన్.. 25.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసింది.
NZ vs PAK: బెంగళూరులో పాకిస్తాన్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వర్షం దోబూచులాడుతోంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో 21.3 ఓవర్లో ఒకసారి వర్షం కురవడంతో ఆటకు అంతరాయం కలగగా సుమారు 45 నిమిషాల తర్వాత ఆట ఆరంభమైంది. 6.40 గంటలకు ఆట మొదలై నాలుగు ఓవర్లు పూర్తిగా పడకముందే మళ్లీ వర్షం మొదలవడంతో ఆట ఆగిపోయింది. ఆట నిలిచే సమయానికి పాకిస్తాన్.. 25.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసింది.
తొలుత వర్షం కారణంగా పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 342 పరుగులకు కుదించగా ఇప్పుడు వర్షం మరింత ఎక్కువవుతుండటంతో మరోసారి ఓవర్ల కుదింపు తప్పకపోవచ్చు. 7.40 గంటలకు అంపైర్లు మరోసారి గ్రౌండ్ ఇన్షెక్షన్‌కు రానున్నారు. ఆ తర్వాత ఆట సాధ్యమవుతుందా..? లేదా..? అన్నది తేలనుంది.
Good News: “If play doesn’t resumes by 7:10 PM, Pakistan will win by 21 runs”. It’s raining heavily right now 🤞 #PAKvsNZ pic.twitter.com/8rz7Sgbe3a
— SAAD 🇵🇰 (@SaadIrfan258) November 4, 2023
ప్రస్తుత స్కోరుబోర్డుతో పాటు బ్యాటింగ్ పరిస్థితులను చూస్తే పాకిస్తాన్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డక్ వర్త్ లూయిస్ విధానంలో విజేతను నిర్ణయించినా 25 ఓవర్లకు చేయాల్సిన స్కోరు కంటే పాకిస్తాన్.. పది పరుగుల ఆధిక్యంలోనే ఉంది. ఆట తొలిసారి నిలిచి తిరిగి ప్రారంభమయ్యాక ఇష్ సోధీ వేసిన రెండు ఓవర్లలో ఫకర్, బాబర్లు దంచికొట్టారు. సోధీ వేసిన 23వ ఓవర్లో బాబర్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇక అతడే వేసిన 25వ ఓవర్లో తొలి బంతికి బాబర్ సిక్సర్ బాది తర్వాత ఫకర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఫకర్ ఆ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదడంతో పాక్ స్కోరు 200 దాటింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

