NZ vs PAK: ఫఖర్ బాదుడుతో పాకిస్తాన్ సెమీస్ ఛాన్సెస్ బేఫికర్.. కివీస్ కు భారీ షాక్
NZ vs PAK: సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో జూలు విదిల్చింది. వర్షం ఎంతకూ వదలకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) విధానంలో విజేతను నిర్ణయించారు.
NZ vs PAK: చిన్నస్వామి స్టేడియంలో సంచలనం నమోదైంది. వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో జూలు విదిల్చింది. ఆ జట్టు ఓపెనర్ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 126 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు సారథి బాబర్ ఆజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. రెండోసారి వర్షం ఎంతకూ వదలకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) విధానంలో విజేతను నిర్ణయించగా పాకిస్తాన్ 21 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
కివీస్ నిర్దేశించిన 402 పరుగుల ఛేదనలో వర్షం కురిసే సమయానికి పాక్.. 25.3 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి 200 పరుగులు చేయడం గమనార్హం. ఫఖర్ జమాన్ వీరబాదుడుతో కివీస్ వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడి సెమీస్ రేసులో ఆ జట్టు ఆఖరిమ్యాచ్ విజయంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితిని కొనితెచ్చుకుంది. కాగా ఈ విజయంతో సౌతాఫ్రికా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

