NZ vs PAK: ఫిన్ అలెన్ విధ్వంసం.. ఫకర్-బాబర్ పోరాడినా పాక్‌కు తప్పని ఓటమి..
NZ vs PAK: హమిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్.. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ అయింది.
NZ vs PAK: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్‌కు వరుస షాకులు తప్పడం లేదు. తొలి మ్యాచ్‌లో ఓడిన పాక్.. రెండో మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైంది. హమిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్.. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్.. 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కివీస్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్‌కు ఓపెనర్ ఫిన్ అలెన్ (41 బంతుల్లో 74, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ స్కోరు చేసేలా బాదాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (20)తో కలిసి తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన అలెన్.. కేన్ విలియమ్సన్ (26, రిటైర్డ్ హార్ట్) తో కలిసి రెండో వికెట్‌కు 78 పరుగులు జతచేశాడు. ఆఖర్లో మిచెల్ శాంట్నర్ (13 బంతుల్లో 25, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టు భారీ స్కోరుచేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పాక్.. పది పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. సయీబ్ అయూబ్ (1), రిజ్వాన్ (7) లు విఫలమయ్యారు. ఫస్ట్ డౌన్లో వచ్చిన బాబర్ ఆజమ్ (43 బంతుల్లో 66, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫకర్ జమాన్ (25 బంతుల్లో 50, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్నా ఆడమ్ మిల్నే జమాన్‌ను ఔట్ చేయడంతో పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది. జమాన్ ఔటయ్యాక పాక్ బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఒక్క కెప్టెన్ షహీన్ షా అఫ్రిది (13 బంతుల్లో 22, 1 ఫోర్, 2 సిక్సర్లు) మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో పాక్.. 173 పరుగుల వద్దే ఆగిపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే రెండు మ్యాచ్‌లను గెలిచిన కివీస్.. మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

