NZ vs PAK: ఫకర్ జమాన్ సుడిగాలి సెంచరీ.. భారీ ఛేదనలో ధీటుగా బదులిస్తున్న పాక్.. ఆటకు వర్షం అంతరాయం
NZ vs PAK: కివీస్ నిర్దేశించిన 402 పరుగుల ఛేదనలో పాకిస్తాన్.. 21 ఓవర్లు ముగిసేటప్పటికే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ బాబర్ ఆజమ్.. అర్థ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండటంతో పాక్ శిబిరంలో విజయంపై ఆశలు రేపుతున్నారు.
NZ vs PAK: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న 35వ లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ధీటుగా బదులిస్తున్నది. కివీస్ నిర్దేశించిన 402 పరుగుల ఛేదనలో పాకిస్తాన్.. 21 ఓవర్లు ముగిసేటప్పటికే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ బాబర్ ఆజమ్.. అర్థ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండటంతో పాక్ శిబిరంలో విజయంపై ఆశలు రేపుతున్నారు.
భారీ ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు రెండో ఓవర్లోనే ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (6) వికెట్‌ను కోల్పోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన బాబర్‌తో కలిసి జమాన్ కివీస్ బౌలర్లను ఆటాడుకుంటున్నాడు. బౌల్ట్ వేసిన ఐదో ఓవర్లో 4, 6తో బాదుడు మొదలుపెట్టిన ఫకర్ అదే ఊపును కొనసాగిస్తున్నాడు. బాబర్ కూడా బౌల్ట్ వేసిన ఏడో ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. 39 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన జమాన్.. గ్లెన్ ఫిలిప్స్ వేసిన 15వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. అతడే వేసిన 17వ ఓవర్లో జమాన్ 6, 4, 4 తో రెచ్చిపోయాడు. సౌథీ వేసిన 19వ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టి 90లలోకి వచ్చిన ఫకర్.. శాంట్నర్ వేసిన 20వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టి రెండో బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తిచేశాడు. 63 బంతుల్లోనే అతడి సెంచరీ పూర్తయింది. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.
వర్షం అంతరాయం..
బెంగళూరులో ఈ మ్యాచ్‌కు ఇదివరకే పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం మళ్లీ 22వ ఓవర్లో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను అంపైర్లు తాత్కాలికంగా వాయిదావేశారు. 22.3 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్.. ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (106 నాటౌట్), బాబర్ ఆజమ్ (47 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఒకవేళ వర్షం ఆగకుంటే డక్‌వర్త్ లూయిస్ విధానంలో విజేతను ప్రకటించాల్సి వచ్చినా పాకిస్తాన్‌కే విజయం దక్కనుంది. 20 ఓవర్లలో 142 పరుగులు చేయాల్సి ఉండగా డీఎల్ఎస్ కంటే పాక్ మెరుగ్గా ఉంది.
ITS RAINING…..!!!!!
– PAKISTAN IS 10 RUNS AHEAD OF DL METHOD.* pic.twitter.com/fQMgIFuZdi
— Johns. (@CricCrazyJohns) November 4, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

