NZ vs AUS | రెండో టెస్టులోనూ అదే వైఫల్యం.. హెజిల్వుడ్ దెబ్బకు కివీస్ ఖేల్ ఖతం
NZ vs AUS | తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన కివీస్.. వెల్లింగ్టన్‌లోనూ అదే ఆటతో నిరాశపరిచింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, పేసర్ టిమ్ సౌథీలు వందో టెస్టులు ఆడుతున్న ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు బ్యాటింగ్‌లో విఫలమైంది.
NZ vs AUS | స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ న్యూజిలాండ్ ఆటతీరు మారలేదు. తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన కివీస్.. వెల్లింగ్టన్‌లోనూ అదే ఆటతో నిరాశపరిచింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, పేసర్ టిమ్ సౌథీలు వందో టెస్టులు ఆడుతున్న ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు బ్యాటింగ్‌లో విఫలమైంది. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ పేసర్ జోష్ హెజిల్వుడ్ పేస్ ధాటికి కివీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. అతడు ఐదు వికెట్ల (5/31) తో మెరవగా మిచెల్ స్టార్క్ మూడు (3/59) వికెట్లు పడగొట్టాడు.
హెజిల్వుడ్ విజృంభణ
పేస్‌కు అనుకూలించే వెల్లింగ్టన్ పిచ్‌పై టాస్ గెలవగానే ఆసీస్ సారథి కమిన్స్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి వికెట్‌కు 18.5 ఓవర్లలో 47 పరుగులు జోడించిన కివీస్.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ టామ్ లాథమ్ (38) ఫర్వాలేదనిపించగా విల్ యంగ్ (14) నిరాశపరిచాడు. వందో టెస్టు ఆడుతున్న కేన్ విలియమ్సన్ .. 37 బంతులాడి 17 పరుగులే చేశాడు. రచిన్ రవీంద్ర (4), మిచెల్ మార్ష్ (4) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. పై ఐదుగురిలో యంగ్ వికెట్ తప్ప మిగిలిన నలుగురూ హెజిల్వుడ్కే చిక్కారు.
107 కే 8 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను మాథ్యూ హెన్రీ (29), టిమ్ సౌథీ (26) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ 25 ప్లస్ స్కోరు చేయడంతో న్యూజిలాండ్.. 162 పరుగులైనా చేయగలిగింది.
ఆసీస్దీ అదే తడబాటు..
కివీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన సంతోషం ఆస్ట్రేలియాకు ఎంతోసేపు నిలవలేదు. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (11) మరోసారి విఫలమవగా ఉస్మాన్ ఖవాజా (16) అదే బాట పట్టాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన కామెరూన్ గ్రీన్.. ఈ మ్యాచ్‌లో 25 పరుగులకే ఔట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ (21) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఇంకా 38 పరుగులు వెనుకబడే ఉంది. మార్నస్ లబూషేన్ (45 నాటౌట్), నైట్ వాచ్మెన్ నాథన్ లియాన్ (1 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

