NZ vs AUS 1st T20I | మార్ష్, డేవిడ్ వీరవిహారం.. భారీ టార్గెట్‌ను ఊదేసిన ఆసీస్
NZ vs AUS 1st T20I | వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన తొలి టీ20లో మిచెల్ మార్ష్ సారథ్యంలోని కంగారూలు.. కివీస్ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించారు. మిచెల్ మార్ష్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో పాటు టిమ్ డేవిడ్ మెరుపులతో ఆసీస్ భారీ విజయాన్ని దక్కించుకుంది.
NZ vs AUS 1st T20I | న్యూజిలాండ్ పర్యటనను ఆసీస్ భారీ విజయంతో ఆరంభించింది. వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన తొలి టీ20లో మిచెల్ మార్ష్ సారథ్యంలోని కంగారూలు.. కివీస్ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించారు. ఆ జట్టు సారథి మిచెల్ మార్ష్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (44 బంతుల్లో 72 నాటౌట్, 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆడగా మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్.. పది బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు భారీ సిక్సర్ల సాయంతో 31 పరుగులతో రాణించడంతో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో తొలి టీ20లో ఘనవిజయాన్ని అందుకుంది.
వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో జరిగిన తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 36 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు ఆసీస్ ముందు భారీ టార్గెట్ ఉంచింది.
లక్ష్య ఛేదనలో ఆసీస్ కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 32, 1 ఫోర్, 3 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మిచెల్ మార్ష్.. మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 25, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (20) అండతో ఆసీస్‌ను విజయం దిశగా తీసుకెళ్లాడు. ఛేదనలో 16 ఓవర్లు ముగిసేటప్పటికీ ఆసీస్.. 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. 26 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉన్న క్రమంలో శాంట్నర్ వేసిన 17వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చి ఇంగ్లిస్‌ను ఔట్ చేశాడు. ఫెర్గూసన్ వేసిన 18వ ఓవర్లో కూడా 8 పరుగులే వచ్చాయి.
Australia won a high-scoring thriller in Wellington to take a 1-0 lead in the T20I series 👌#NZvAUS 📝 : https://t.co/rqwX3jLtZU pic.twitter.com/QszL57qDUc
— ICC (@ICC) February 21, 2024
కానీ ఆడమ్ మిల్నే వేసిన 19వ ఓవర్లో డేవిడ్ వీరవిహారం చేశాడు. ఈ ఓవర్లో తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే రాగా ఆఖరి మూడు బంతుల్లో 4, 6, 6తో 19 రన్స్ రాబట్టాడు. ఆఖరి ఓవర్లో 16 రన్స్ అవసరం కాగా రెండు బంతుల్లో టిమ్ సౌథీ మూడు పరుగులే ఇచ్చాడు. చివరి నాలుగు బంతుల్లో డేవిడ్.. 4, 6, 2. 4 బాది కంగారూలను విజయం వైపు నిలిపాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మార్ష్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

