విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 266 పరుగులు చేసి, బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 44 పరుగుల వెనుకంజలో ఉంది. 9 వికెట్లకు 310 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ మరో పరుగు జతచేయకుండానే ఆలౌటైయింది.
- న్యూజిలాండ్ 266/8
సిల్హెట్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 266 పరుగులు చేసి, బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 44 పరుగుల వెనుకంజలో ఉంది. 9 వికెట్లకు 310 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ మరో పరుగు జతచేయకుండానే ఆలౌటైయింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు.
ఒకవైపు వికెట్లు కూలుతున్నా విలియమ్సన్ కుదురుగా ఆడి టెస్టులలో తన 29వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మిచెల్(41)తో కలిసి నాలుగో వికెట్‌కు 66 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్(42)తో కలిసి ఆరో వికెట్‌కు 78 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 189 బంతుల్లో 11బౌండరీలతో సెంచరీ పూరించిన విలియమ్సన్ 104 పరుగులకు ఏడో వికెట్‌గా వెనుతిరిగాడు. కైల్ జేమీసన్(7), కెప్టెన్ టిమ్ సౌథీ(1) ఆటలో కొనసాగుతున్నారు. తౌజిల్ ఇస్లామ్ 4 వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

