Novak Djokovic | టెన్నిస్ ఖరీదైన ఆట.. నా కోసం అమ్మానాన్న ఎంతో కష్టపడ్డారు : జకోవిచ్
Novak Djokovic : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) కొత్త ఏడాది కూడా జోరు చూపిస్తున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగు పెట్టిన జకో అలవోకగా నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం కోర్టు ఇంటర్వ్యూలో జకో తన...
Novak Djokovic : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) కొత్త ఏడాది కూడా జోరు చూపిస్తున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగు పెట్టిన జకో అలవోకగా నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం కోర్టు ఇంటర్వ్యూలో జకో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను టెన్నిస్ లెజెండ్స్‌లో ఒకడిగా ఎదగడానికి కారణమైన తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు.
‘మిగతా ఆటలతో పోల్చితే టెన్నిస్ అనేది చాలా ఖరీదైనది. నన్ను టెన్నిస్ ప్లేయర్ చేయడం కోసం నాన్న సెర్జాన్ జకోవిచ్, అమ్మ డిజానా జకోవిచ్ ఆర్ధికంగా ఎన్నో కష్టాలు అనుభవించారు. సరైన వసతులు లేకపోవడంతో కొన్నిసార్లు జూనియర్ స్థాయి టోర్నీల్లో పాల్గొనలేకపోయా. పైగా అప్పుడు సెర్బియాలో యుద్ద వాతావరణం ఉండేది. దాంతో, 1990లో సెర్బియా నుంచి వలస వచ్చాక మా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది. అయినా సరే నా కలను నిజం చేయడానికి అమ్మానాన్న అన్నింటినీ భరించారు అని జకోవిచ్ తెలిపాడు.
జకోవిచ్ కోర్టు ఇంటర్వ్యూ
రోజర్ ఫెదరర్(Roger Federer), రఫెల్ నాదల్(Rafeal Nadal)లు టెన్నిస్ కోర్టును ఏలుతున్న దశలో జకోవిచ్ ఎంట్రీ ఇచ్చాడు. బక్కపలచని కుర్రాడిగా కనిపించినా బలమైన టెక్నిక్, అద్భుతమైన పోరాట పటమతో ఫెదరర్, నాదల్కు పోటీగా ఎదిగాడు. 2007 యూఎస్ ఓపెన్(US Open)లో స్విస్ స్టార్‌ను ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించాడు. నిరుడు ఏకంగా ఆరు ట్రోఫీలు కొల్లగొట్టిన జకో.. 24 గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఫెదరర్, జకోవిచ్

కరోనా వ్యాక్సీన్ వివాదంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2002 ఎడిషన్‌కు దూరమైన జకోవిచ్.. నిరుడు విజేతగా నిలిచాడు. అదే ఊపులో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఎడిషన్‌లోనూ జకో దూకుడుగా ఆడుతున్నాడు. మూడో రౌండ్లో థామస్ మార్టిన్ ఎట్చ్వెర్రీని అలవోకగా ఓడించాడు. మూడు సెట్లలో తిరుగులేని ఆధిపత్యం కనబరిచి 6-3, 6-3, 7-6తో మ్యాచ్ ముగించాడు.
ఇవి కూడా చదవండి
- Sania Mirza – Shoaib Malik: మనుషులను గెలిచి.. మనసులను గెలవలేని టెన్నిస్ – క్రికెట్ జోడీ
- Dasoju Sravan | అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన రేవంత్: బీఆర్ఎస్ నేత శ్రవణ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

