లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ నాలుగో రౌండ్లో జొకో 6-0, 6-3, 6-4 తేడాతో తన దేశానికే చెందిన కెమనోవిచ్‌పై అలవోక విజయం సాధించాడు. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన జొకో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
ఆదివారం జరిగే ప్రిక్వార్టర్స్ పోరులో వాన్ రిజితోవెన్తో తలపడుతాడు. మిగతా మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 6-2, 6-3తో బుజామెస్క్పై, మెర్టెన్స్ 6-4, 7-5తో కెర్బర్‌పై గెలిచి ముందంజ వేశారు. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా, పావిచ్ జోడీ 6-4, 3-6, 7-6(10/3)తో జాల్మిద్జె, హెర్నాండెజ్ ద్వయంపై గెలిచింది.