KL Rahul | ‘ధోనీ రివ్యూ సిస్టమ్’ కాదు.. ‘డిసిషన్ రాహుల్ సిస్టమ్’
KL Rahul | గతంలో వికెట్ కీపర్ కం సారధిగా ఎంఎస్ ధోనీ.. రివ్యూకి వెళితే.. అంపైర్ తడబడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు టీం ఇండియా సారధి రోహిత్ శర్మ కూడా.. ప్రస్తుత కేఎల్ రాహుల్.. రివ్యూకు వెళ్లాలంటేనే రివ్యూకు అప్పీల్ చేస్తున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించడంతో పాటు.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిన మహేంద్రసింగ్ ధోనీ.. బ్యాట్‌తో భారీ షాట్లు ఆడటంతో పాటు.. కీపర్‌గానూ తనదైన ముద్ర వేశాడు. ఒకప్పుడు వికెట్ల వెనుక నుంచి ధోనీ అప్పీల్ చేశాడంటే చాలు అంపైర్ తన నిర్ణయంపై సందేహ పడిపోయేవాడు. రివ్యూ తీసుకోవడంలో ధోనీ కచ్చితత్వం అతడిని మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
అంతర్జాతీయ క్రికెటలో డిసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్ఎస్) ప్రవేశ పెట్టిన తర్వాత.. దాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న మహీ.. ఎన్నోసార్లు అంపైర్ల నిర్ణయాలు తప్పని తన అప్పీల్‌తో నిరూపించాడు. దీంతో డిసిషన్ రివ్యూ సిస్టం కాస్తా ‘ధోనీ రివ్యూ సిస్టం’గా మారిపోయింది. అయితే అంతటి అనుభజ్ఞుడు ఈ సారి వన్డే వరల్డ్‌కప్‌లో అందుబాటులో లేకపోయేసరికి టీమ్ఇండియా తడబుతుందేమో అనుకుంటే.. రాహుల్ భళా అనిపించుకుంటున్నాడు.
చిరుత లాంటి కండ్లతో వికెట్ల మీద దృష్టి పెట్టే రాహుల్.. బంతి గమనం, వేగం, ఎత్తు విషయంలో కెప్టెన్‌కు సరైన సలహాలు ఇస్తూ.. జూనియర్ మహీ అనిపించుకుంటున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ముఖ్యంగా బౌలర్లు బాగా జోష్‌లో ఉండే సమయంలో వారి మాటలు పట్టించుకోకుండా.. రాహుల్ అంగీకరిస్తేనే రోహిత్ రివ్యూకు వెళ్తున్నాడు.
మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు వెన్నెముకగా నిలవడంతో పాటు.. కెప్టెన్ సందేహంలో ఉన్న ప్రతిసారి రివ్యూ విషయంలో రాహుల్ సాయపడుతున్నాడు. అతడి నిర్ణయాలు చాలా వరకు సరైనవే అని తేలడంతో హిట్‌మ్యాన్ కూడా.. పూర్తిగా రాహుల్‌పైనే భారం వేస్తున్నాడు. జడేజా, కుల్దీప్ వంటి స్పిన్నర్ల బంతులను అంచనా వేయడం బ్యాటర్లకే కష్టమైతున్న సమయంలో.. వికెట్ల వెనుక నుంచి రాహుల్ వాటిని చక్కగా చదువుతుండటం విశేషం. దీంతో గతంలో ధోనీ రివ్యూ సిస్టమ్‌గా పిలుచుకునే డీఆర్ఎస్ను ఇప్పుడు అభిమానులు ముద్దుగా ‘డిసిషన్ రాహుల్ సిస్టమ్’గా నామకరణం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

