బెంగళూరు: దులీప్ ట్రోఫీలో నార్త్‌జోన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. బెంగళూరు వేదికగా జరిగిన రెండో క్వార్టర్స్‌లో నార్త్.. వెస్ట్‌జోన్‌పై 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి రోజు వెస్ట్ విజయానికి 67 రన్స్ అవసరం కాగా రుతురాజ్ గైక్వాడ్ సేన ఓవర్‌నైట్ స్కోరు(220)కు మరో 14 పరుగులు మాత్రమే జోడించి 234కు ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అబిద్ ముస్తాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టి నార్త్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈనెల 30 నుంచి మొదలయ్యే సెమీఫైనల్ మ్యాచుల్లో భాగంగా తొలి సెమీస్‌లో సెంట్రల్ జోన్.. ఈస్ట్‌తో తలపడాల్సి ఉండగా రెండో పోరులో సౌత్, నార్త్ జోన్లు ఢీకొననున్నాయి.