CWC 2023: అరుపుల్లేవ్.. ఆర్బాటాల్లేవ్.. చప్పట్లే సంబురాలు..!
CWC 2023: ద్వైపాక్షిక సిరీస్‌లు, లీగ్‌లలో ట్రోఫీలను గెలిస్తేనే కొన్ని క్రికెట్ జట్లు వారి అభిమానులతో విజయయాత్రలు, వేలాది మంది జనసందోహం మధ్య ఆ ట్రోఫీని ఊరేగిస్తాయి. కానీ ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌ను భారత్‌లో ఓడించి ఏకంగా ఆరోసారి ఆ ట్రోఫీని ముద్దాడిన ఆసీస్ టీమ్‌కు మాత్రం..
CWC 2023: ఏ ఆటలో అయినా అత్యుత్తమ టోర్నీని గెలవడం ఏ జట్టుకైనా ప్రత్యేకమే. క్రికెట్లో ఆ విలువ ఐసీసీ ట్రోఫీది. ద్వైపాక్షిక సిరీస్‌లు, లీగ్‌లలో ట్రోఫీలను గెలిస్తేనే కొన్ని క్రికెట్ జట్లు వారి అభిమానులతో విజయయాత్రలు, వేలాది మంది జనసందోహం మధ్య ఆ ట్రోఫీని ఊరేగిస్తాయి. 2022లో శ్రీలంక ఆసియా కప్ గెలిచినప్పుడు కొలంబో వీధులు కిక్కిరిసిపోగా ఇదే ఏడాది ఆఖర్లో అర్జెంటీనా ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వెళ్తే అక్కడ ఇసుకవేస్తే రాలనంత జనం. కానీ ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌ను భారత్‌లో ఓడించి ఏకంగా ఆరోసారి ఆ ట్రోఫీని ముద్దాడిన ఆసీస్ టీమ్‌కు మాత్రం అభిమానుల నుంచి స్పందనే కరువైంది. `ఆ గెలిచారులే పెద్ద కప్పు..` అన్నట్టుగా ఆ దేశ క్రికెట్ అభిమానులు వ్యవహరిస్తుండటం ఆటగాళ్లకు విస్మయానికి గురిచేస్తోంది.
వరల్డ్ కప్ ట్రోఫీని తీసుకొచ్చి ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ప్రదర్శనకు పెడితే దానిని చూడటానికి అభిమానులే రాలేదు. ఆసీస్ సారథి పాట్ కమిన్స్, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌లు ట్రోఫీని తీసుకొచ్చి మీడియా ముందు ఉంచగా అక్కడ ఉన్న పదిమంది పాత్రికేయుల చప్పట్లే ఆసీస్ జట్టుకు సంబురాలయ్యాయి. కమిన్స్, స్టార్క్‌లు వరల్డ్ కప్ ట్రోఫీతో సిడ్నీలో ఫోజిచ్చిన ఫోటోలను ఐసీసీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్టు చేసింది.
Pat Cummins and Mitchell Starc reunited with the World Cup trophy #CWC23 pic.twitter.com/2IM8yTxll6
— Andrew McGlashan (@andymcg_cricket) November 28, 2023
ఆస్ట్రేలియన్లు ఐసీసీ ట్రోఫీని లైట్ తీసుకున్నారా..? అంటే అక్కడ పరిణామాలను చూస్తుంటే అంతే అనిపిస్తోంది. ప్రపంచకప్ నెగ్గిన తర్వాత కమిన్స్ సిడ్నీ విమానాశ్రయం దిగినవెంటనే అక్కడ అతడికి ఎదురైన స్వాగతం బహుశా క్రికెట్ ప్రపంచంలో ఏ సారథీ ఎదుర్కోని ఉండడు. విమానాశ్రయంలో ఒక్కరు కూడా అతడిని పట్టించుకోనట్టే వెళ్లిపోయారు. తాజాగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లోనూ ఇదే జరిగింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా విజయయాత్రల వంటివి కూడా ప్లాన్ చేయలేదు.
🏆 Back in 🇦🇺 #CWC23 pic.twitter.com/QqLAdBQb5S
— ICC (@ICC) November 28, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

