Newzealand : ప్రపంచ క్రికెట్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు నిక్ కెల్లీ(Nick Kelly), ట్రాయ్ జాన్సన్(Troy Jhonson)లు కండ్లు చెదిరే క్యాచ్ పట్టారు. వెల్లింగ్టన్, సూపర్ డిస్ట్రిక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ అద్భుత క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సూపర్ డిస్ట్రిక్స్ ఓపెనర్ విల్ యంగ్ (Will Young)ఆరో ఓవర్లో లాంగాన్‌లో గాల్లోకి లేపిన బంతిని అందుకునేందుకు నిక్ చిరుతలా పరుగెత్తాడు.
అయితే.. బౌండరీ వద్ద బంతిని అందుకున్న అతడు బ్యాలెన్స్ తప్పడంతో బంతిని వెనకాలే ఉన్న జాన్సన్ వైపు విసిరాడు. అలా ఇద్దరూ కలిసి సూపర్ క్యాచ్ పట్టేశారు. అంతే.. ఒక్కసారిగా స్టేడియం వాట్ ఏ క్యాచ్ అంటూ హోరెత్తిపోయింది. ఆ వీడియో చూసిన కొందరు ఫ్యాన్స్ కలా? నిజమా? అంటూ షాక్‌లో ఉండిపోయారు. ప్రపంచంలోని ఇది అద్భుత క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Don’t rub your eyes. It’s real!
.
.#SuperSmashOnFanCode pic.twitter.com/J5DRk1U3VA— FanCode (@FanCode) January 13, 2024
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ భారీ స్కోర్ చేసింది. లోగన్ వాన్ బీక్(41 నాటౌట్), మహ్మద్ అబ్బాస్(35)లు రాణించడంతో 8 వికెట్ల నష్టానికి 147 రన్స్ కొట్టింది. అనంతరం ఛేదనలో జాక్ బాయ్లే హాఫ్ సెంచరీతో మెరవగా.. ఆల్‌రౌండర్ బ్రాస్‌వెల్ 30 పరుగులతో సత్తా చాటాడు. దాంతో, సెంట్రల్ డిస్ట్రిక్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.