Antim Naqvi | జింబాబ్వే తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ.. చరిత్రను తిరగరాసిన యువకెరటం
Antim Naqvi : జింబాబ్వే యవ క్రికెటర్ అంతిమ్ నక్వీ(Antim Naqvi) చరిత్ర సృష్టించాడు. ఆండీ ఫ్లవర్(Andy Flower), గ్రాంట్ ఫ్లవర్(Garnt Flower) వంటి దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వే తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ..
Antim Naqvi : జింబాబ్వే యవ క్రికెటర్ అంతిమ్ నక్వీ(Antim Naqvi) చరిత్ర సృష్టించాడు. ఆండీ ఫ్లవర్(Andy Flower), గ్రాంట్ ఫ్లవర్(Garnt Flower) వంటి దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వే తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. మిడ్ వెస్ట్ రైనోస్(Mid West Rhinos) కెప్టెన్ అయిన అంతిమ్ రెండో సీజన్లోనే తడాఖా చూపించాడు. జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టాడు.
లోగన్ కప్(Logan Cup) మ్యాచ్‌లో భాగంగా మెటాబెలెలలాండ్ టస్కర్స్(Matabeleland Tuskers) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అంతిమ్ దంచికొట్టాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఊచకోతకు దిగిన 24 ఏండ్ల అంతిమ్.. 295 బంతుల్లోనే 30 ఫోర్లు, 10 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీకి చేరువై రికార్డులు బద్ధలు కొట్టాడు. అయితే.. గతంలో గ్రేమ్ హిక్(Greame Hick), ముర్రే గుడ్విన్(Murray Goodwin)లు కూడా ఫస్ట్ క్లాస్‌లో మూడొందలు కొట్టారు. కానీ, వాళ్లు జింబాబ్వేకు కాకుండా ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు.
— Zimbabwe Cricket (@ZimCricketv) January 13, 2024
అంతిమ్ 265 పరుగుల స్కోర్ వద్ద లోగన్ కప్ ఫస్ట్ క్లాస్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక 280 రన్స్ దాటిన అంతిమ్ 1967-68 మధ్య రే గ్రిప్పర్ 279 రన్స్‌తో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. జింబాబ్వే గడ్డపై ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 306. అది కూడా న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ రిచర్డ్సన్(Mark Richardson) పేరిట ఉంది. రిచర్డ్సన్ 2000-01లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ రికార్డు సాధించాడు. అయితే.. రైనోస్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో అంతిమ్ ఈ రికార్డును బద్ధలు కొట్టలేకపోయాడు.
ఇవి కూడా చదవండి
- Hydroxychloroquine | అది సంజీవని కాదు విషం .. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వినియోగంతో 11 శాతం పెరిగిన కరోనా మరణాలు
- BRS | గులాబీ తరంగం.. ఓటమి పాఠం నుంచి గెలుపు శపథం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asia Cup Rising Stars | భారత్ ఖేల్‌ఖతం.. సెమీస్‌లోనే ఓడిన తిలక్సేన
Gold Price | పసిడి పయనమెటు.. ఈ ఏడాది రూ.55,500 డౌన్.. ఇప్పుడు కొనాలా.. వేచి చూడాలా?
Delimitation Bill | డీలిమిటేషన్‌కు రంగం సిద్ధం.. 30 నుంచి లోక్‌సభ, 2 నుంచి రాజ్యసభ సమావేశాలు
Indiramma Bima | ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. ములుగు జిల్లా వాజేడులో అధికారుల ఆదేశాలు!
Vivek Venkataswamy | పెద్దపల్లి వివాదంతో నాకేం సంబంధం.. కాంగ్రెస్ ఇన్చార్జి సందీప్‌తో వివేక్
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

