న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ఏస్ పేసర్ మ్యాట్ హెన్రీ వన్డే ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ హెన్రీ నాలుగు వారాల పాట ఆటకు దూరం కావాల్సిందేనని వైద్యులు తెలపడంతో.. అతడి స్థానంలో న్యూజిలాండ్ పేస్ ఆల్‌రౌండర్ కైల్ జెమీసన్‌ను ఎంపిక చేసుకుంది.
ఆరున్నర అడుగుల ఆజానుభావుడైన జెమీసన్ గురువారమే జట్టుతో చేరగా.. పాక్‌తో మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే చాన్స్ ఉంది.