పేలవ ఫామ్ తో దినదినగండంగా మారిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ భవిష్యత్ పై ఒకవైపు అభిమానులు ఆందోళన చెందుతుంటే అతడు చేస్తున్న పనులు కూడా క్రికెట్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో అట్టర్ ఫ్లాఫ్ అయిన కోహ్లీ తాజాగా ఓ యాడ్ లో దర్శనమిచ్చాడు. దీంతో నెటిజన్లు కోహ్లీని ఆటాడుకుంటున్నారు.
‘Wellman’ అనే ఓ ఫార్మా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు కోహ్లీ. ఈ సంస్థ తాజాగా కోహ్లీతో ఓ యాడ్ చేసింది. పురుషులు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు గాను Wellman సంస్థ తయారుచేసిన మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ వాడాలని యాడ్ లో కోహ్లీ సూచించాడు. తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
కోహ్లీ ఈ పోస్టు చేయగానే నెటిజన్లు ఫైర్ అయ్యారు. ‘నువ్వు ఇప్పుడు కూడా యాడ్స్ చేస్తున్నావా..?’, ‘ఇంగ్లండ్ టూర్ లో టెస్టు, 2 టీ20లు, 2 వన్దేలలో కలిపి చేసింది 76 రన్స్. వరుసగా విఫలమవుతున్నా నువ్వు మాత్రం యాడ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావ్.. ఇది కరెక్ట్ కాదు కోహ్లీ..’, ‘ఇతడిని జట్టు నుంచి తప్పించాలి. బ్యాటింగ్ చేయమంటే సోషల్ మీడియాలో ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నాడు. ఇతడు మునపటి కోహ్లీ కాదు..’, ‘అవి వాడి ఏం లాభం.. అన్ని విటమిన్లు తిని నువ్వెందుకు స్ట్రాంగ్ గా ఆడట్లేదు..’ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం.. ‘ఇవన్నీ వదిలేసి రంజీలు, దేశవాళీ క్రికెట్ ఆడి మునపటి ఫామ్ ను అందుకో..’ అని సూచిస్తున్నారు.
2022లో కోహ్లీ ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్ (ఐపీఎల్ మినహాయించి) ఆడి 493 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫిఫ్టీలున్నాయి. గడిచిన మూడేండ్లుగా కోహ్లీ.. 71వ సెంచరీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు.
This fellow needs to be dropped. He is busy selling products on social media….this VK is different from the Virat Kohli we are used to. #ViratKohli𓃵 #BCCI #kapildev
— Siddhant Bhargava (@Sidz1911) July 18, 2022
Better Join Bollywood , Focus on Films and advertisement instead of Cricket . be honest, I am huge fan of you VK but reality is that your cricketing career is day by day finishing .if u want re-gain , Join Ranji/Some Local match otherwise soon we will get your tweet of retirement
— CS_NAVEEN( “Mr funny man”) 🙏 Jai Shree Ram🚩 (@CSNABINSAHOO) July 18, 2022