Umar Akmal: ఇంతకీ ఏం చెప్పాలనుకున్నావ్? ఏం చెప్పావ్..? కోహ్లీకి బర్త్ డే విషెస్ చెప్పబోయి బొక్కబోర్లా పడ్డ పాక్ క్రికెటర్
Umar Akmal: విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు సందర్భంగా అతడిని విష్ చేసేందుకు చేసిన ట్వీట్ అర్థరహితంగా ఉండటంతో నెటిజన్లు అక్మల్‌ను ఆటాడుకుంటున్నారు.
Umar Akmal: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యాడు. టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు సందర్భంగా అతడిని విష్ చేసేందుకు చేసిన ట్వీట్ అర్థరహితంగా ఉండటంతో నెటిజన్లు అక్మల్‌ను ఆటాడుకుంటున్నారు. కోహ్లీ బర్త్ డే తో పాటు వన్డేలలో సచిన్ రికార్డును సమం చేసిన నేపథ్యంలో అతడు ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే బ్రదర్ @విరాట్ కోహ్లీ, టూ కింగ్ ఇన్ ఇండియా సార్ @సచిన్, విరాట్ కోహ్లీ @బీసీసీఐ ’ అంటూ అర్థం పర్థం లేకుండా ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అసలు అక్మల్ ఏం చెప్పాలనుకున్నాడు..? కోహ్లీకి బర్త్ డే విషెస్ చెప్పాడా..? లేక సచిన్ రికార్డును సమం చేసినందుకు ట్వీట్ వేశాడా..? తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే తన ట్వీట్ ద్వారా అక్మల్ చెప్పాలనుకుంది ఏంటంటే.. కోహ్లీ తన పుట్టినరోజు సందర్భంగా సచిన్ వన్డే శతకాల రికార్డును సమం చేసినందుకు శుభాకాంక్షలతో పాటు బర్త్‌డే విషెస్ కూడా యాడ్ చేశాడు. కానీ ఇంగ్లీష్‌లో దానిని సరిగా వెల్లడించలేకపోయాడు.
Happy birthday brother @imVkohli to king in India sir @sachin_rt 🙌🏻 Virat kohli @BCCI pic.twitter.com/VNY9UWC9z4
— Umar Akmal (@Umar96Akmal) November 5, 2023
అక్మల్ ఇలా ఇంగ్లీష్ రాక దొరికిపోవడం ఇదేం కొత్తకాదు. గతంలోనూ అతడికి ఇలాంటి కళాకండాలు వేసిన అనుభవముంది. అయితే తాజాగా అక్మల్ ట్వీట్‌పై నెటిజన్లు దయ, జాలి లేకుండా ఆటాడుకుంటున్నారు. ‘అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావ్..? ఏం చెప్పావ్..?’, ‘నువ్వు ఏం చెబుతున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా..?’ అంటూ మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అక్మల్ ట్వీట్‌తో పాటు ఈ ట్రోల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
sachin & virat 😭 pic.twitter.com/dXYGSoRUqv
— Who cares? (@Retired__hurt) November 5, 2023
Same vibes 😜😜 pic.twitter.com/RrcxqxuUtI
— Rahul chopra (@ChopraRahul23) November 6, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

