CWC 2023: టీమిండియాను కించపరుస్తూ అభ్యంతరకర పోస్టు.. లైక్ చేసిన కమిన్స్, మ్యాక్సీ.. ఫ్యాన్స్ ఆగ్రహం
CWC 2023: ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. ట్రోఫీ మీద కాలిబెట్టిన ఘటన మరువకముందే తాజాగా ఆస్ట్రేలియా మీడియా చేసిన ఓ అభ్యంతరకర పోస్టును ఆసీస్ ఆటగాళ్లు లైక్, కామెంట్ చేయడం భారతీయ క్రికెట్ అభిమానులకు కోపాన్ని తెప్పిస్తున్నది.
CWC 2023: ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల అత్యుత్సాహం శృతి మించుతోంది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే కంగారూ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. ట్రోఫీ మీద కాలిబెట్టిన ఘటన మరువకముందే తాజాగా ఆస్ట్రేలియా మీడియా చేసిన ఓ అభ్యంతరకర పోస్టును ఆసీస్ ఆటగాళ్లు లైక్, కామెంట్ చేయడం భారతీయ క్రికెట్ అభిమానులకు కోపాన్ని తెప్పిస్తున్నది. టీమిండియాను కించపరిచేలా ఉన్న ఆ పోస్టుపై గ్లెన్ మ్యాక్స్‌వెల్, పాట్ కమిన్స్‌లు లైక్ చేయడమే ఇందుకు కారణం.
బెటూటా అడ్వకేట్ అనే మ్యాగజైన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ మహిళ ప్రసవించిన ఫోటోను మార్ఫ్ చేసింది. మహిళ ఫేస్‌లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను పెట్టి.. ‘సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసే విధంగా ఒకే కాన్పులో 11 మంది మగపిల్లలకు జన్మనిచ్చాడు..’ అంటూ పోస్టులో రాసుకొచ్చింది. చిన్నపిల్లల ముఖాలకు బదులు భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాల ఫేస్‌లను మార్ఫ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్టును మ్యాక్స్‌వెల్, కమిన్స్‌లతో పాటు ఆసీస్ మాజీ సారథి ఆరోన్ ఫించ్‌లు లైక్ చేశారు. కమిన్స్ అయితే మరో అడుగు ముందుకేసి నవ్వుతున్న ఎమోజీలు పెట్టి కామెంట్ కూడా చేయడం గమనార్హం.
ఆసీస్ ఆటగాళ్లు, అక్కడి మీడియావ్యవహరిస్తున్న తీరుపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజమేనని, మరీ ఇంత తలబిరుసు పనికిరాదని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను విమర్శించడం ఆసీస్ మీడియాకు ఇదే తొలిసారి కాదు. కొద్దిరోజుల క్రితమే ముగిసిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్‌ను కూడా చిన్నపిల్లాడి ఫేస్‌తో మార్ఫింగ్ చేసి నోట్లో పాలపీక పెట్టి ప్రచురించిన కథనం విమర్శలకు తావిచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

