నెదర్లాండ్స్ సూపర్ విక్టరీ
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ అదరగొట్టింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పై సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది.
4,6,4,6,6,4.. వెస్టిండీస్‌తో సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ వాన్ బీక్ సృష్టించిన విధ్వంసమిది. అనంతరం బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు పడగొట్టిన బీక్ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ అదరగొట్టింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పై సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (65 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించగా.. కింగ్ (76), చార్లెస్ (54), హోప్ (47), కీమో పాల్ (46) రాణించారు. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స 9 వికెట్లకు సరిగ్గా 374 పరుగులు చేసింది. తేజ (111) శతక్కొట్టాడు. స్కోర్లు సమం కావడంతో ఫలితం తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ ప్లేయర్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ బీక్ చుక్కలు చూపాడు. హోల్డర్ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ 6 బంతుల్లో 30 పరుగులు రాబట్టాడు. అనంతరం బీక్ బౌలింగ్‌లో విండీస్ 8 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. మరో మ్యాచ్‌లో జింబాబ్వే 304 పరుగుల తేడాతో అమెరికాను చిత్తుచేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

