ODI World Cup 2027 | ఐసీసీ నిర్ణయం నిరాశపరిచింది.. కొత్త ఫార్మాట్‌తో మేము నష్టపోతాం..!
ODI World Cup 2027 : క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకున్న వరల్డ్‌కప్ ఫార్మాట్ మార్పు నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది.
ODI World Cup 2027 : క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీసుకున్న వరల్డ్‌కప్ ఫార్మాట్ మార్పు నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది. రాబోయే వన్డే ప్రపంచకప్(2027)లో కొత్తగా ‘సూపర్ సిరీస్’, సూపర్ 7 వంటివి తమ పాలిట విలన్ అవుతాయని అసోసియేట్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వన్డే వరల్డ్‌కప్ 2027 ఫార్మాట్ మార్చడాన్ని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(Scott Edwards) తప్పుబట్టాడు. ఈ కొత్త ఫార్మాట్‌తో తాము నష్టపోతామని పేర్కొన్న డచ్ సారథి ఐసీసీ మరోసారి ఆలోచన చేయాలని సూచించాడు. ‘ఏ దేశానికైనా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి అర్హత సాధించడమే అతి పెద్ద విజయం. ఎన్నో సంవత్సరాలు ప్రణాళికలు వేసుకొని ప్రపంచకప్ ఆడాలనుకోగా.. అర్హతలు మారిస్తే ఎలా?.
The ICC’s decision to revamp the format of next year’s 50-over World Cup has been met with anger and confusion by players from Associate nations pic.twitter.com/gDSOsvduKp
— Cricinfo (@cricinfo) July 17, 2026
ఐసీసీ నిర్ణయం మమ్మల్సి నిరాశకు గురి చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ఎంతో చేస్తున్నామని ఐసీసీ చెబుతుంటుంది. కానీ, ఇలాంటి నిర్ణయాలు అసోసియేట్ దేశాలకు కఠినంగా మారుతాయి. ప్రపంచంలోని ఉత్తమ జట్లతో మేము పోటీపడడాన్ని మరింత కష్టతరం చేస్తాయి’ అని స్కాట్ ఎడ్వర్డ్స్ పేర్కొన్నాడు.
So you’re telling me, associate sides have to play in a 3 year 50 over tournament, to qualify for a qualifier to qualify for another tri-series qualifier to then qualify for a World Cup. https://t.co/DzdlqS0tZG
— Maxwell O’Dowd (@Maxiboi23) July 15, 2026
డచ్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ ఓ డౌడ్.. ఐసీసీ కొత్త ఫార్మాట్‌పై నిప్పులు చెరిగాడు. ‘చిన్నజట్లకు సూపర్ సిరీస్ అని ఐసీసీ చెబుతోంది. దీని ప్రకారం అసోసియేటెడ్ దేశాలు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించేందుకు మూడేళ్లు 50 ఓవర్ల క్రికెట్ ఆడాలి. అనంతరం క్వాలిఫయర్ దాటేందుకు ముక్కోణపు సిరీస్ ఆడాల్సి వస్తుంది’ అని డౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ నెదర్లాండ్స్ జట్టు ఐదు వరల్డ్‌కప్‌లు ఆడింది. 1996, 2003, 2007, 2011, 2023లో ఆడిన డచ్ జట్టు ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటలేదు. మొత్తంగా 29 మ్యాచుల్లో నాలుగే నాలుగు విజయాలతో సరిపెట్టుకుంది.
సూపర్ 6కు బదులు సూపర్ 7
వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల వన్డే వరల్డ్‌కప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరింత ఆసక్తికరంగా మార్చేసింది. 14 జట్లతో సూపర్ సిక్స్ దశ, సెమీ-ఫైనల్, ఫైనల్.. ఇలా కొనసాగాల్సిన మెగా ఈవెంట్లో కీలక మార్పులు చేసింది ఐసీసీ. తక్కువ ర్యాంకున్న జట్లను దృష్టిలో పెట్టుకొని సూపర్ సిరీస్‌కు రూపమిచ్చింది అత్యున్నత క్రికెట్ బోర్డు. అంతేకాదు.. సూపర్ 6కు బదులు సూపర్ 7 రౌండ్ తెరపైకి వచ్చింది. దాంతో.. పెద్దజట్లతో పోటీపడలేని పసికూనలకు కూడా ముందంజ వేసే అవకాశం లభించనుంది.
The ICC has announced an exciting revamped format for the Men’s @cricketworldcup 2027 edition in South Africa, Zimbabwe and Namibia 🏆
More details ➡️ https://t.co/VxWr3PFpIX pic.twitter.com/RU1VnCbE9B
— ICC (@ICC) July 15, 2026
వరల్డ్‌కప్ గ్రూప్ దశ తర్వాతి రౌండ్ (రెండోది)కు 12 జట్లు అర్హత సాధిస్తాయి. రెండో దశగా పేర్కొనే ఇందులో ఒక్కో గ్రూప్‌లో ఆరు జట్లు.. మొత్తం 30 మ్యాచులు ఉంటాయి. అయితే.. కొత్తగా ఐసీసీ ప్రవేశపెట్టిన సూపర్ 7 ప్రకారం ఏడు జట్లు నాకౌట్‌కు చేరుతాయి. రౌండ్ రాబిన్ పద్ధతి అనంతరం రెండు గ్రూపుల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు.. రెండు గ్రూపుల్లో అత్యధిక పాయింట్లున్న జట్టు ఏడో జట్టుగా సూపర్ 7కు దూసుకెళ్తుంది. ఆపై.. ఈ ఏడింటిలో టాప్-4 జట్లు సెమీఫైనల్‌కు వెళ్తాయి. సెమీస్ దాటిన జట్లు టైటిల్ పోరులో అమీతుమీకి సిద్ధమవుతాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

