డచ్ దరువు అమెరికాపై 3-1తో అద్భుత విజయం
ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ ధమాకా షురూ అయ్యింది. లీగ్ దశలోనే ఫ్యాన్స్‌ను ఉర్రుతాలూగించిన మెగాటోర్నీ మరిన్ని తళుకుబెళుకులతో సిద్ధమైంది. శ
- క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్
- ఫిఫా ప్రపంచకప్ టోర్నీ
ఫిఫా ప్రపంచకప్‌లో అసలు సిసలు మజా మొదలైంది. ఇక నుంచి గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికే. మెగాటోర్నీ తొలి ప్రిక్వార్టర్స్ పోరులో నెదర్లాండ్స్ దుమ్మురేపింది. సంప్రదాయ ఆటతీరుతో కట్టిపడేస్తూ అమెరికాను మట్టికరిపించింది. ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన డచ్ టీమ్..అమెరికాను ఓ ఆటాడుకుంది. చురుకైన స్ట్రైకింగ్‌కు తోడు పటిష్ఠమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అభిమానుల అశేష మద్దతుతో చెలరేగిన నెదర్లాండ్స్ తమ వరుస విజయాల పరంపరను కొనసాగిస్తూ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
అల్ రయాన్: ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ ధమాకా షురూ అయ్యింది. లీగ్ దశలోనే ఫ్యాన్స్‌ను ఉర్రుతాలూగించిన మెగాటోర్నీ మరిన్ని తళుకుబెళుకులతో సిద్ధమైంది. శనివారం జరిగిన తొలి ప్రిక్వార్టర్స్ పోరులో నెదర్లాండ్స్ 3-1 తేడాతో అమెరికాపై అద్భుత విజయం సాధించింది. డచ్ జట్టు తరఫున మెంఫిస్ డెపె(10ని), డాలీ బ్లైండ్(45+ని), డెంజెల్ డమ్‌ఫ్రైస్(81ని) గోల్స్ అందించారు. హజీ రైట్(76ని) అమెరికాకు ఏకైక గోల్ అందించాడు.
ఆది నుంచే జోరు:
అమెరికాతో కీలకమైన ప్రిక్వార్టర్స్ పోరులో నెదర్లాండ్స్ ఆది నుంచే తమదైన జోరు కనబరిచింది. మ్యాచ్ పదో నిమిషంలో సహచరుల నుంచి 21పాస్‌ల ద్వారా బంతిని అందుకున్న మెంఫిస్ కండ్లు చెదిరే రీతిలో గోల్ కొట్టాడు. దీంతో డచ్ టీమ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ ప్రథమార్ధం మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా డాలీ బ్లైండ్..అమెరికా రక్షణ శ్రేణిని కంగుతినిపిస్తూ గోల్ కొట్టాడు. అమెరికా డిఫెండర్లు నిశ్చేష్టులైన వేళ బ్లైండ్ కొట్టిన గోల్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. కీలకమైన ద్వితీయార్ధంలో ప్రణాళిక ప్రకారం ముందుకుసాగిన లాయిస్ వాన్గాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నెదర్లాండ్స్‌కు అమెరికా పోటీనిచ్చే ప్రయత్నం చేసింది. మ్యాచ్ 76వ నిమిషంలో డచ్ డిఫెన్స్‌ను చేధిస్తూ రైట్ గోల్ చేయడంతో స్కోరు 1-2కు చేరింది. కానీ అమెరికా ఆశలు ఎక్కువసేపు నిలువలేదు. ఐదు నిమిషాల వ్యవధిలో డమ్‌ఫ్రైస్ చాకచక్యంగా గోల్ చేయడంతో నెదర్లాండ్స్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది.
బ్రెజిల్‌కు షాక్: కీలకమైన ప్రిక్వార్టర్స్‌కు ముందు బ్రెజిల్‌కు షాక్ తగిలింది. కామెరూన్ చేతిలో బ్రెజిల్ 0-1తో ఖంగుతింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

