NED vs BAN: నెదర్లాండ్స్ బ్యాటింగ్ వైఫల్యం.. ఆదుకున్న కెప్టెన్.. బంగ్లా ముందు ఈజీ టార్గెట్
NED vs BAN: భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. బంగ్లా బౌలర్ల ధాటికి ఆ జట్టు 229కే పరిమితమైంది.
NED vs BAN: భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ అయింది బంగ్లా పేసర్ల ధాటికి డచ్ టాపార్డర్ కుప్పకూలగా కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (89 బంతుల్లో 68, 6 ఫోర్లు) తో పాటు సిబ్రండ్ (61 బంతుల్లో 35, 3 ఫోర్లు) లు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి నెదర్లాండ్స్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాంలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు రెండో ఓవర్లోనే తొలి షాక్ తగిలింది. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ (3)ను టస్కిన్ అహ్మద్ తాను వేసిన మొదటి ఓవర్లోనే ఔట్ చేసి బంగ్లాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. మరుసటి ఓవర్లో షోరిఫుల్ ఇస్లాం.. మ్యాక్స్ ఓడౌడ్‌ను డకౌట్ చేశాడు. నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్‌ను వెస్లీ బరెసి (41 బంతుల్లో 41, 8 ఫోర్లు) ఆదుకున్నాడు. కొలిన్ అకర్మన్ (15)తో కలిసి మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించాడు. కానీ 14 వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ నెదర్లాండ్స్‌కు మరో షాకిచ్చాడు. క్రీజులో కుదురుకున్న బరెసిని పెవిలియన్‌కు పంపాడు. ఆ మరుసటి ఓవర్లోనే షకిబ్ అల్ హసన్.. అకర్‌మన్‌ను ఔట్ చేశాడు.
ఆదుకున్న కెప్టెన్..
63కే నాలుగు వికెట్లు కోల్పోయిన డచ్ టీమ్‌ను కెప్టెన్ ఎడ్వర్డ్స్ ఆదుకున్నాడు. బస్ డీ లీడె (32 బంతుల్లో 17) తో కలిసి ఐదో వికెట్‌కు 44 పరుగులు జతచేశాడు. బంగ్లా స్పిన్నర్లతో పాటు పేసర్లను సమర్థంగా ఎదుర్కున్న ఈ జోడీని టస్కిన్ అహ్మద్ విడదీశాడు. లీడె నిష్క్రమించిన తర్వాత సిబ్రండ్ తో జట్టుకట్టిన ఎడ్వర్డ్స్.. స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 78 పరుగులు జోడించింది. 78 బంతుల్లో అర్థ సెంచీర పూర్తిచేసిన ఎడ్వర్డ్స్‌కు వరల్డ్ కప్‌లో ఇది రెండో అర్థ సెంచరీ. వన్డే కెరీర్లో 15వది. ఈ క్రమంలో నెదర్లాండ్స్ తరఫున అత్యధిక అర్థ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఎడ్వర్డ్స్ రికార్డులకెక్కాడు. చివరి ఓవర్లలో ఎడ్వర్డ్స్ నిష్క్రమించడంతో లోయరార్డర్ కూడా తడబడింది. సిబ్రండ్ను మెహిది హసన్ వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. లొగాన్ వాన్ బీక్ (16 బంతుల్లో 23 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) బ్యాట్ ఝుళిపించడంతో డచ్ స్కోరు 200 పరుగుల మార్కు దాటింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

