Asian Games | చైనా చేతిలో భారత మహిళల హాకీ జట్టు ఓటమి.. కాంస్య పతకం కోసం పోటీ..!
Asian Games | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ఆతిథ్య చైనా జట్టు 4-0 గోల్స్ తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆసియా గేమ్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా కల చెదిరిపోయింది.
Asian Games | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో
ఓటమిపాలైంది. ఆతిథ్య చైనా జట్టు 4-0 గోల్స్ తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆసియా గేమ్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. చివరిసారిగా 2018లో జకార్తా ఆసియా క్రీడల్లో టైటిల్ మ్యాచ్‌లో జపాన్‌పై ఓటమిపాలైంది. 1982 నుంచి భారత మహిళల జట్టు బంగారు పతాకాన్ని సాధించలేకపోయింది.
ఈ సారైనా ఫైనల్‌కు చేరాలన్న కల కలగానే మిగిలింది. 1998లో దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. ఇక భారత జట్టు ఆసియా క్రీడల్లో కాంస్య పతకం కోసం పోటీపడనున్నది. ఈ నెల 7న జపాన్ లేదంటే దక్షిణ కొరియాతో తలపడనున్నది. మహిళల హాకీలో చైనాపై భారత్‌కు ఇది పదో ఓటమి. ఇరుదేశాల మధ్య 23 మ్యాచ్‌లు జరగ్గా.. 11 మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో మాత్రం చైనాపై ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది.
మరో పది మ్యాచ్‌లు చైనా గెలువగా.. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఆసియా గేమ్స్‌లో మహిళల జట్టు తొలిమ్యాచ్‌లో సింగపూర్‌ను 13-0 గోల్స్‌తో ఓడించింది. ఆ తర్వాత మలేషియాపై 6-0తో గెలుపొందింది. దక్షిణ కొరియాతో జరిగిన మూడో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగింది. హాంకాంగ్‌పై 13-0తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓమిటి లేకుండా అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. సెమీఫైనల్లో చైనాతో మ్యాచ్‌లో మాత్రం తబడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

