Navjot Singh Sidhu | వైభవంగా భారత మాజీ క్రికెటర్ కుమారుడి వివాహం.. ఫొటోలు వైరల్
Navjot Singh Sidhu : భారత మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్థూ(Navjot Singh Sidhu) ఇంట పెండ్లి సందడి నెలకొంది. అతడి కుమారుడు కరణ్ సిద్ధూ(Karan Sidhu) వివాహ వేడుక బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వృత్తిరీత్యా లాయర్ అయిన...
Navjot Singh Sidhu : భారత మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్థూ(Navjot Singh Sidhu) ఇంట పెండ్లి సందడి నెలకొంది. అతడి కుమారుడు కరణ్ సిద్ధూ(Karan Sidhu) వివాహ వేడుక బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వృత్తిరీత్యా లాయర్ అయిన కరణ్ పంజాబ్‌లోని పాటియాలకు చెందిన ఇనాయత్ రంధావా(Inayat Randhava)ను మనువాడాడు.
వారిద్దరి పెండ్లి వేడుక ఫొటోలను సిద్ధూ తాజాగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు ‘కప్ ఆఫ్ జాయ్’ అని క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Son’s Wedding Day….. “Cup of Joy” !! pic.twitter.com/zoARPAQ9gB
— Navjot Singh Sidhu (@sherryontopp) December 7, 2023
టీమిండియా గొప్ప క్రికెటర్లలో ఒకడైన సిద్ధూ సిక్సర్ల కింగ్‌గా పేరొందాడు. టాపార్డర్ బ్యాటర్ అయిన సిద్ధూ 1987 వరల్డ్ కప్‌లో నాలుగు హాఫ్ సెంచరీలతో విజృంభించాడు. భారత జట్టు తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన సిద్ధూ 1999 డిసెంబర్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు.
నవ్‌జోత్ సింగ్ సిద్థూ

అతడు తన 19 ఏండ్ల కెరీర్లో 51 టెస్టులు, 136 వన్డేలు ఆడాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధూ కొన్నాళ్లు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా సేవలందించాడు. అంతేకాదు హిందీలో బాగా పాపులర్ అయిన ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కామెడీ షోలో సిద్దూ జడ్జిగా వ్యవహరించాడు.
ఇవి కూడా చదవండి
- Maoist arrested | గోదావరిఖనిలో మావోయిస్టు దళ సభ్యుడి అరెస్ట్
- Copa America 2024 | కొపా అమెరికా కప్ డ్రా.. అర్జెంటీనా తొలి పోరు ఆ జట్టుతోనే
- KCR | కేసీఆర్ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

