Navdeep Saini | భారత క్రికెట్లో పెండ్లి బాజా.. ప్రేయసిని వివాహం చేసుకున్న సైనీ
Navdeep Saini : భారత జట్టులో వరుసగా పెండ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ ఏడాది కేఎల్ రాహుల్(KL Rahul), రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) వివాహం చేసుకోగా.. తాజాగా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ(Navdeep Saini) ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం సైనీ తన ప్రేయసి స్వాతి ఆస్థాన(Swati Asthana)ని...
Navdeep Saini : భారత జట్టులో వరుసగా పెండ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ ఏడాది కేఎల్ రాహుల్(KL Rahul), రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) వివాహం చేసుకోగా.. తాజాగా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ(Navdeep Saini) ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం సైనీ తన ప్రేయసి స్వాతి ఆస్థాన(Swati Asthana)ని పెండ్లి చేసుకున్నాడు. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సైనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు.
‘నీతో ప్రతిరోజు ప్రేమతో నిండినదే. ఈరోజుతో మనం ఆ ప్రేమను శాశ్వతం చేస్తున్నాం. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ శుభ సమయంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కోరుతున్నాం’ అని సైనీ క్యాప్షన్ రాశాడు. ఆ ఫొటోలకు చూసిన క్రికెటర్లు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సైనీ, స్వాతి కొనేండ్లుగా ప్రేమలో ఉన్నారు. స్వాతి ఒక వ్లాగర్. ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టయిల్ గురించి నిత్యం ఆన్లైన్లో వీడియోలు పెడుతుంటుంది.
హరియాణకు చెందిన సైనీ 2019లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వన్డేల్లో, టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు 2021 ఆస్ట్రేలియా పర్యటనలో చివరిసారి భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది రెస్ట్ ఆఫ్ ఇండియా(ROI) ఇరానీ కప్ గెలవడంలో సైనీ కీలకపాత్ర పోషించాడు. ఈ మధ్యే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడాడు.

అయితే.. పేలవ ప్రదర్శనతో ఈ కుడి చేతివాటం పేసర్ తీవ్రంగా నిరాశ పరిచాడు. మూడు ఓవర్లలో 32 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. మొత్తం ఏడు మ్యాచుల్లో 4 వికెట్లు తీశాడంతే. ఐపీఎల్ 16వ సీజన్లో సైనీ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 3 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు.
ఇవి కూడా చదవండి
-
Telangana | మల్లా కేసీఆర్ అస్తనే.. గివన్నీ ఉంటయ్.. నాడు చంద్రబాబును నిలదీసిన ఫణికర మల్లయ్య మాట ఇది
-
Qatar Court: నేవీ ఆఫీసర్లకు మరణశిక్ష.. భారత్ అప్పీల్‌ను స్వీకరించిన ఖతార్
-
Extra Ordinary Man | నితిన్ టీం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్స్ షురూ.. స్టిల్స్ వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

