Nathan Lyon: నేను చూసిన టఫెస్ట్ బ్యాటర్లలో ఇద్దరు ఇండియా నుంచే.. ఆసీస్ స్పిన్ దిగ్గజం
Nathan Lyon: ఆస్ట్రేలియాలో షేన్ వార్న్ తర్వాత టెస్టులలో ఐదు వందల వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా ఘనత దక్కించుకున్న లియాన్.. తన సుదీర్ఘ కెరీర్లో తాను చూసిన టఫెస్ట్ బ్యాటర్ల పేర్లను వెల్లడించాడు.
Nathan Lyon: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ నాథన్ లియాన్ ఇటీవలే టెస్టులలో ఐదు వందల వికెట్లు తీసిన ఘనత దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో షేన్ వార్న్ తర్వాత టెస్టులలో ఐదు వందల వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా ఘనత దక్కించుకున్న లియాన్.. తన సుదీర్ఘ కెరీర్లో తాను చూసిన టఫెస్ట్ బ్యాటర్ల పేర్లను వెల్లడించాడు. పాకిస్తాన్‌తో సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కాబోయే ఆఖరి టెస్టు ముందు లియాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మీ కెరీర్లో మీకు వ్యతిరేకంగా ఆడిన ప్రత్యర్థి జట్లలో మీరు చూసిన బెస్ట్ ప్లేయర్ ఎవరు..? అన్న ప్రశ్నకు లియాన్ సమాధానమిస్తూ… ‘సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్’ అని బదులిచ్చాడు. డివిలియర్స్ సౌతాఫ్రికా బ్యాటర్ కాగా కోహ్లీ, సచిన్‌లు భారత్‌కు చెందినవారే కావడం గమనార్హం. 2023లో లియాన్.. 47 వికెట్లు పడగొట్టాడు.
Nathan Lyon on the best players he’s played against:
Virat Kohli.
Sachin Tendulkar.
AB De Villiers.pic.twitter.com/XLy5Ux8tAB— Mufaddal Vohra (@mufaddal_vohra) January 1, 2024
టెస్టులలో లియాన్.. కోహ్లీని ఏడుసార్లు ఔట్ చేసిన బౌలర్లలో రెండోవాడు. తొలి స్థానంలో జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. స్పిన్నర్ల విషయంలో మాత్రం కోహ్లీని అన్ని సార్లు ఔట్ చేసిన బౌలర్ మాత్రం లియానే.. టెస్టులలో లియాన్ బౌలింగ్‌లో సుమారు వెయ్యికి పైగా బంతులను ఎదుర్కున్న కోహ్లీ.. 511 పరుగులు రాబట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

