నమస్తే తెలంగాణ బోణీ.. 7 హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: విలేకర్ల ఆటవిడుపు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 7హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్ (ఎమ్‌పీఎల్)లో నమస్తే తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఎల్ఆర్ఐటీ)లో మంగళవారం హెచ్ఎంటీవీతో జరిగిన మ్యాచ్‌లో నమస్తే తెలంగాణ 6 వికెట్లతో గెలిచింది. హెచ్ఎంటీవీ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. రవి (39 బంతుల్లో 49 నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రదీప్ (4/16), సాయిచందర్ (3/16), సందీప్ (2/17) ధాటికి హెచ్ఎంటీవీ 16.3 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. విజేతగా నిలిచిన నమస్తే తెలంగాణ జట్టును ఎమ్ఎల్ఆర్ఐటీ సెక్రెటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారుల కోసం కాలేజీలో అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

