WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
WPL 2027 : మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ వేలానికి ముందే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లేయర్ ట్రేడింగ్‌తో వార్తల్లో నిలిచింది. అలాఅనీ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను వదులుకోలేదు. టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న మహిళా పేసర్ తారా నోరిస్ (Tara Norris)ను ముంబై మహిళల జట్టు భారీ ధరకు కొన్నది.
WPL 2027 : మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ వేలానికి ముందే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లేయర్ ట్రేడింగ్‌తో వార్తల్లో నిలిచింది. అలాఅనీ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను వదులుకోలేదు. టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న మహిళా పేసర్ తారా నోరిస్ (Tara Norris)ను ముంబై మహిళల జట్టు భారీ ధరకు కొన్నది. అసోసియేటెడ్ దేశాల ప్లేయర్ అయిన నోరిన్ను యూపీ వారియర్స్ (UP Warriorz) నుంచి ముంబై కొనుక్కుంది. ఏకంగా రూ.10 లక్షలు ఇచ్చి ఈ ఎడమ చేతివాటం పేసర్‌ను తీసుకుంది ముంబై. నిరుడు వేలంలో నోరిస్‌ను యూపీ ఇంతే ధరకు కొన్న విషయం తెలిసిందే.
ఐదో సీజన్ మహిళల ప్రీమియర్ లీగ్ వేలం సమీపిస్తున్న వేళ ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 28న కొచ్చిలో వేలం జరగనుండగా.. అంతకు ముందే అనుభవజ్ఞురాలై పేసర్‌ను ట్రేడింగ్ పద్ధతిలో తమ కుటుంబంలోకి ఆహ్వానించింది ముంబై. ఫ్రాంచైజీ క్రికెట్లో, డబ్ల్యూపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న తారా నోరిస్‌ను భారీ ధరకు దక్కించుకుందీ మాజీ ఛాంపియన్.
From 🇺🇸 to Mumbai, left-arm pacer Tara Norris joins our FA𝕄𝕀LY! 💙✨ https://t.co/5hgSYXvqti
— Mumbai Indians (@mipaltan) October 12, 2026
గత ఎడిషన్‌లో యూపీ వారియర్స్‌కు ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను రూ.10లకు కొనేసింది ముంబై. నాలుగో సీజన్ వేలంలో నోరాను యూపీ ఇంతే మొత్తానికి కొన్నది. దాంతో.. అంతే ధరకు ఇప్పుడు ఆమెను ముంబైకి అప్పగించింది యూపీ. తను ముంబైకి ఆడడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు ది హండ్రెడ్ లీగ్‌లో ఎంఐ లండన్ (MI London) జెర్సీతో నోరిస్ మైదానంలో మెరిసింది.
ఢిల్లీ వదిలేయడంతో
డబ్ల్యూపీఎల్‌లో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌కు 2023 సీజన్లో ఆడిన తారా నోరిస్ ఆకట్టుకుంది. ఐదు మ్యాచులాడిన తను 4.33 సగటుతో తను 7 వికెట్లు తీసింది. ఆ తర్వాతి ఎడిషన్ వేలంలో నోరిస్‌ను యూపీ వారియర్స్ కొన్నది. అయితే.. మహిళల టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ కోసం అమెరికా స్క్వాడ్‌కు ఎంపికవడంతో తను ఆ సీజన్ ఆడలేదు. 2026 సీజన్ వేలంలో యూపీ ఆమెకు రూ.10 లక్షలు చెల్లించింది. సెప్టెంబర్ 28న తుది గడువున నోరిస్‌ను అట్టిపెట్టుకుంది యూపీ. ఆ తర్వాత ముంబై ట్రేడింగ్ ప్రతిపాదన తీసుకురాగా తనను అంతే ధరకు అప్పగించేందుకు యూపీ అంగీకరించింది. దాంతో, వేలానికి ముందు ముంబై జట్టు విదేశీ ప్లేయర్ల కోటా నిండింది. ప్రస్తుతం ఎంఐ ఖాతాలో రూ.90 లక్షలున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

