IPL 2024 | సూపర్ హీరో అవతారంలో ముంబై క్రికెటర్లు.. వీడియో వైరల్
IPL 2024 : ఐపీఎల్ జట్లలో విజయవంతమైన ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఆరో టైటిల్ వేటకు కాచుకొని ఉంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాకతో మరింత జోష్‌లో ఉన్న ముంబై.. 17 వసీజన్‌లో పంజా విసిరేందుకు సిద్ధమైంది. అందుకు తగ్గట్టే ఆ ఫ్రాంచైజీ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌ను..
IPL 2024 : ఐపీఎల్ జట్లలో విజయవంతమైన ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఆరో టైటిల్ వేటకు కాచుకొని ఉంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాకతో మరింత జోష్‌లో ఉన్న ముంబై.. 17 వసీజన్‌లో పంజా విసిరేందుకు సిద్ధమైంది. అందుకు తగ్గట్టే ఆ ఫ్రాంచైజీ ఒక గదిని సూపర్ హీరో థీమ్(Super Hero Theme)తో సరికొత్తగా డిజైన్ చేసింది. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, గెరాల్డ్ కొయేట్జీల ఫొటోలను సూపర్ హీరో అవతారంలో కనిపించారు. ఆ వీడియోను ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
పదిహేడో సీజన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీవీ రూమ్‌లో విశాలమైన పూల్ టేబుల్ ఉంది. సూపర్ హీరో థీమ్ రూమ్ చూసిన ముంబై ఆటగాళ్లు ఫిదా అవుతున్నారు. పేసర్లు రొమారియో షెపర్డ్, నేహల్ వధేరాలు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సూపర్‌గా ఉందంటూ మురిసిపోయారు.
Welcome to 𝐓𝐡𝐞 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐬 𝐒𝐮𝐩𝐞𝐫𝐡𝐞𝐫𝐨-𝐯𝐞𝐫𝐬𝐞 🤙🔥
📹 Here’s a sneak peek into our Team Room 🚪💙#OneFamily #MumbaiIndians pic.twitter.com/USeLioQQfm
— Mumbai Indians (@mipaltan) March 15, 2024
ఆటగాడిగా నాలుగు టైటిళ్లు
ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలం ముందు పాండ్యా తిరిగి సొంత గూటికి చేరాడు. ముంబై తరఫున 2015, 2017, 2019, 2020లో ట్రోఫీ గెలిచిన అతడిని 2021లో ముంబై వదిలేసింది. దాంతో, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఎంపికైన పాండ్యా ఆ జట్టును తొలి సీజన్లోనే చాంపియన్‌గా నిలిపాడు. 16వ సీజన్లోనూ గుజరాత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

పాండ్యాను వదిలేసి పెద్ద పొరపాటు చేశామని భావించిన ముంబై ఫ్రాంచైజీ అతడిని ట్రేడింగ్ పద్ధతిలో కొన్నది. అయితే.. రోహిత్ శర్మను తప్పించి అతడిని కెప్టెన్ చేయడం విమర్శలకు తావిచ్చినా.. ముంబై హెడ్‌కోచ్ నుంచి మేనేజ్మెంట్ వరకూ అంతా పాండ్యాకు మద్దతుగా నిలిచారు.
ఇవి కూడా చదవండి
- Modi-ED | అద్దిరబన్నా మోదన్నా ముద్దర మూల్యం కడతావా!
- All England Open | మాజీ చాంపియన్‌కు ఝలక్… సెమీఫైనల్లో లక్ష్యసేన్
- Canada | కెనడాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

