మరో రెండేళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడనున్న ధోనీ

చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్‌న్యూస్. తమ అభిమాన క్రికెటర్‌ను ఇండియన్ కలర్స్‌లో చూడలేకపోయినా.. కనీసం మరో రెండేళ్లు ఫీల్డ్‌లో చూసే అవకాశం దక్కనుంది. బుధవారమే తన 40వ పుట్టిన రోజు జరుపుకున్న ఈ మిస్టర్ కూల్.. మరో రెండేళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడతాడని ఆ టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అతడు కనీసం మరో ఏడాది, రెండేళ్లు సీఎస్కేతోనే కొనసాగుతాడు. అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. అతడు కొనసాగకపోవడానికి ఎలాంటి కారణం లేదు అని ఆయన చెప్పారు.
ఈ ఏడాది ఐపీఎల్లో ఓ ప్లేయర్‌గా ధోనీ పెద్దగా రాణించకపోయినా కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి నడిపించాడు. కరోనా కారణంగా టోర్నీ అర్ధంతరంగా ముగిసే సమయానికి పాయింట్ల టేబుల్లో చెన్నై రెండో స్థానంలో ఉంది. బ్యాట్స్‌మన్‌గా ధోనీ ఫామ్‌లో లేకపోయినా.. చెన్నై టీమ్ మాత్రం ఇప్పటికీ అతని సామర్థ్యంపై ఎలాంటి సందేహాలు లేవని చెబుతోంది. మా వరకూ అతడు చెన్నై టీమ్‌కు చేస్తున్న సేవలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. కెప్టెన్‌గా, నాయకుడిగానే కాదు.. ఓ ప్లేయర్‌గా కూడా టీమ్‌కు ఉపయోగపడగలడన్న నమ్మకం మాకు ఉంది. అతడో మంచి ఫినిషర్. ఇప్పటికే అదే చేయగలడు అని విశ్వనాథన్ అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

