బౌలింగ్ యాక్షన్‌పై డౌట్.. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్‌పై సస్పెన్షన్
లాహోర్: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ హస్నైన్‌పై నిషేధం విధించారు. హస్నైన్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఐసీసీ తేల్చింది. బౌలింగ్ యాక్షన్‌పై అతను గత నెలలో లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్‌లో పరీక్షలకు హాజరయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌తో పాటు బిగ్ బాష్ లీగ్ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేశారు. పాక్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున అతను ఆడుతున్నాడు. లాహోర్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా కూడా సమీక్షించింది. హస్నైన్ వేసిన ఎక్కువ బంతుల్లో .. అతని బౌలింగ్ యాక్షన్ 15 డిగ్రీల పరిమితిని దాటినట్లు రిపోర్ట్‌లో తేలింది. అయితే హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌పై సమీక్ష నిర్వహించేందుకు నిపుణులను ఏర్పాటు చేసినట్లు పీసీబీ తెలిపింది. త్వరలో మళ్లీ అతని బౌలింగ్ యాక్షన్‌పై సమీక్ష ఉంటుందని పీసీబీ చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

