‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’: నిఖత్ జరీన్
బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధిస్తానన్న మాట నిలబెట్టుకున్నానని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అంది.
- స్టార్ బాక్సర్‌కు ఎమ్ఎల్ఆర్ఐటీ సన్మానం
దుండిగల్: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధిస్తానన్న మాట నిలబెట్టుకున్నానని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక గేమ్స్‌లో ప్రత్యర్థులను తన పంచ్‌పవర్ మట్టికరిపించిన ఈ ఇందూరు బాక్సర్ పసిడి పతకాన్ని ముద్దాడింది. ఇచ్చిన మాట ప్రకారం పతకంతో తిరిగివచ్చిన తమ విద్యార్థికి మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఎల్ఆర్ఐటీ) బుధవారం ఘన స్వాగతం పలికింది.
వందల మంది విద్యార్థులు జయహో నిఖత్ అంటూ జయజయధ్వానాలు చేస్తూ బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిఖత్ మాట్లాడుతూ ‘ఎమ్ఎల్ఆర్ఐటీ ఇస్తున్న ప్రోత్సాహానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు, అన్ని రంగాల్లో అబ్బాయిలకు దీటుగా రాణిస్తున్నాం. కామన్వెల్త్లో పతకం గెలిచిన తర్వాత కాలేజీకి వస్తానన్న మాటను నిలబెట్టుకున్నాను’ అని అంది. ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ఆర్ఐటీ చైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

