Mitchell Starc | టెస్టుల్లో స్టార్క్ సంచలనం.. తొలి ఓవర్లోనే వికెట్‌తో ‘ఆల్‌టైమ్’ రికార్డు..!
Mitchell Starc : సుదీర్ఘ ఫార్మాట్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) సంచలనం సృష్టించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మెక్కే టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన ఈ స్పీడ్‌స్టర్ 'ఆల్‌టైమ్ రికార్డు' బద్దలు కొట్టాడు.
Mitchell Starc : సుదీర్ఘ ఫార్మాట్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) సంచలనం సృష్టించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మెక్కే టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన ఈ స్పీడ్‌స్టర్ ‘ఆల్‌టైమ్ రికార్డు’ బద్దలు కొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వికెట్ తీసిన స్టార్క్.. తొమ్మిదోసారి ఈఘనత సాధించాడు. దాంతో, ఇప్పటివరకూ అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్(James Anderson) రెండో స్థానానికి పడిపోయాడు.
బుల్లెట్ బంతులతో బ్యాటర్లను భయపెట్టే మిచెల్ స్టార్క్ స్వదేశంలో బంగ్లాదేశ్‌పై తన తడాఖా చూపించాడు. మెక్కే టెస్టు తొలి సెషన్ ప్రారంభంలోనే నిప్పులు చెరిగిన ఈ పొడగరి పేసర్ టపాటపా ఐదు వికెట్లు కూల్చాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ షద్మాన్ ఇస్లాం()ను ఔట్ చేసి బంగ్లాకు షాకిచ్చాడు.
Mitchell Starc and first-over wickets… we’ve seen it before ⚡ pic.twitter.com/0lirGE22jz
— Cricinfo (@cricinfo) August 22, 2026
సుదీర్ఘ ఫార్మాట్ తొలి ఓవర్లోనే వికెట్ తీయడం అతడికిది 9వ సారి. దాంతో.. జేమ్స్ అండర్సన్ పేరిట ఉన్న రికార్డు స్టార్క్ సొంతమైంది. టెస్టుల్లో వెటరన్ బౌలరైన అండర్సన్ 8సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకూ భారత లెజెండ్ కపిల్ దేవ్, న్యూజిలాండ్ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ, రే లిండ్వాల్(ఆస్ట్రేలియా)లు ఏడుసార్లు తొలి ఓవర్లోనే వికెట్ తీశారు.
Five in no time for Starc ⚡️
(via @cricketcomau) pic.twitter.com/Bsj5iWklyS
— Cricinfo (@cricinfo) August 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

