పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సీడెడ్ ప్లేయర్లు మిరా ఆండ్రీవా, బెలిందా బెన్సిచ్, మార్తా కొస్త్యుక్ శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 8వ సీడ్ రష్యా యువ సంచలనం ఆండ్రీవా 6-3, 6-3తో స్థానిక ఫేవరెట్ ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)పై ఏకపక్ష విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
మరో మ్యాచ్‌లో 11వ సీడ్ బెన్సిచ్ (స్విట్జర్లాండ్)6-2, 6-3తో సినోజా క్రాస్ (ఆస్ట్రియా)ను చిత్తు చేసింది. 15వ సీడ్ కొస్త్యుక్ (ఉక్రెయిన్) 6-2, 6-3తో ఒక్సానా (రష్యా)పై విజయం సాధించగా.. 26వ సీడ్ హేలీ బాప్టిస్ట్ (అమెరికా) 6-7, 7-6, 6-2తో మాజీ చాంపియన్ బార్బొరా క్రెజికోవా (చెక్)ను ఓడించి ఔరా అనిపించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-3, 6-4, 6-2తో బెంజమిన్ బోంజి (ఫ్రాన్స్)ను వరుస సెట్లలో చిత్తు చేసి రెండో రౌండ్లో అడుగు పెట్టగా.. మరో మ్యాచ్‌లో రష్యా ప్లేయర్ కారెన్ కచనోన్ 6-3, 7-6 (7/3), 6-0తో ఆర్థర్ గియా (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.