Michael Clarke : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(Michael Clarke) తన గురించి ప్రచారమవుతున్న అసత్య కథనాలను కొట్టిపారేశాడు. యవ్వనంగా కనిపించేందుకు తాను ఎలాంటి ఇంజెక్షన్లు తీసుకోలేదని స్పష్టం చేశాడు. ‘యంగ్ లుక్ కోసం నేను బొటాక్స్, ఫిల్లెర్స్ వంటివి వాడలేదు. ఇది నూటికి నూరు శాతం నిజం’ అని క్లార్క్ అన్నాడు. అసలేం జరిగిందంటే.. క్లార్క్ ఈ మధ్య దిగిన ఫొటోల్లో యంగ్‌గా కనిపించాడు.
‘ది మన్సే’ అనే నాన్ సర్జికల్ కాస్మొటిక్ కంపెనీ స్థాపకురాలు డాక్టర్ నవోమి మెక్కల్లమ్(Naomi McCullum) ఆ ఫొటోలపై స్పందిస్తూ.. క్లార్క్ కండ్లు కొత్తగా అనిపిస్తున్నాయి అని కామెంట్ చేసింది. దాంతో, క్లార్క్ యంగ్‌గా కనిపించేందుకు బొటాక్స్, ఫిల్లెర్స్ వంటివి తీసుకొని ఉంటాడనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ ఇంజెక్షన్ల కోసం అతడు మూడు నెలలకు రూ. 1 లక్ష ఖర్చు చేసి ఉంటాడని అభిమానులు జోరుగా చర్చించుకున్నారు.
వరల్డ్ కప్ ట్రోఫీతో క్లార్క్
దాంతో, ఆసీస్ దిగ్గజం తనపై వస్తున్న తప్పుడు కథనాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. అవేమీ నిజం కాదని చెప్పి అందరి నోళ్లు మూయించాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడి పేరొందిన క్లార్క్ గొప్పి ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడ సారథ్యంలో ఆస్ట్రేలియా 2015లో వరల్డ్ కప్ గెలుపొందింది. అదే ఏడాది యాషెస్ సిరీస్ అనంతరం ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం క్లార్క్ కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.