Lionel Messi : ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో ఊహించని ఓటమిని లియోనల్ మెస్సీ(Lionel Messi) తట్టుకోలేకపోయాడు. ఆదివారం న్యూ జెర్సీ మైదానంలో స్పెయిన్(Spain) చేతిలో కంగుతినడాన్ని జీర్ణించుకోలేకపోయాడీ వెటరన్. నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో అర్జెంటీనా(Argentina)ను విజేతగా నిలిపిన మెస్సీ.. తన సారథ్యంలో వరసగా రెండోసారి ట్రోఫీ అందించాలనుకున్నాడు. కానీ, లీగ్ దశ నుంచి ప్రతి మ్యాచ్‌లో గోల్ కొట్టిన ఈ మాంత్రికుడు తీరా టైటిల్ పోరులో తేలిపోయాడు. దుర్బేధ్యమైన స్పెయిన్ డిఫెన్స్‌ను ఛేదించి.. అర్జెంటీనాకు ఆధిక్యాన్ని ఇవ్వలేక.. కళ్లముందే మ్యాచ్ చేజారుతున్నా అద్భుతం చేయలేక చేష్టలుడిగిపోయాడీ లెజెండ్.
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన కల చెదరడంతో మైదానంలో వలవల ఏడ్చేశాడు. ఆదివారం అర్థ రాత్రి న్యూజెర్సీలో జరిగిన టైటిల్ పోరులో స్పెయిన్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయిన మెస్సీ బృందం కప్‌ను వదిలేసింది. టోర్నీలో పలుమార్లు వెనకబడినా.. ద్వితీయార్థంలో పుంజుకుని టైటిల్ పోరుకు దూసుకొచ్చిన అర్జెంటీనా మళ్లీ అదే మ్యాజిక్ చేయలేకపోయింది.
LAMINE COMFORTS MESSI AFTER THE FINAL! 👏🏽🥹
Despite Spain lifting the 2026 World Cup trophy, the Barcelona star made his way over to Lionel Messi after the final whistle to show his respect for the Argentine legend 💙❤️#LamineYamal #LionelMessi #Spain #WorldCup2026 #Football pic.twitter.com/WTAKw5LTXe
— MARCA in English 🇺🇸 (@MARCAinENGLISH) July 20, 2026
కంచుకోటలాంటి స్పెయిన్ డిఫెన్స్‌ను ఛేదించలేక.. తమ గోల్‌పోస్ట్‌పై ప్రత్యర్థి ఫార్వర్డ్ దండయాత్రను అడ్డకున్నా గోల్ కొట్టలేకపోయారు. అంతే.. 16 ఏళ్ల తర్వాత యూరప్ జట్టు రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది. నాలుగోసారి ఫిఫా ట్రోఫీని ముద్దాడాలనుకున్న అర్జెంటీనా ఉసూరుమంటూ మిన్నకుండిపోయింది.
🔟 Así se despide un grande de grandes 👏🏻 Con lágrimas en los ojos, #LionelMessi se para frente a su público 🇦🇷
Via #MundialTelemundo pic.twitter.com/mTsFZbQg1F— NOTICIAS MUSKITIAHN (@NMoskitiahn) July 19, 2026
అర్జెంటీనా దారుణ ఓటమిని నమ్మలేకపోయిన మెస్సీ.. మైదానంలోనే ఏడ్చేశాడు. కెరీర్లో చివరి వరల్డ్‌కప్ ఆడేసిన అతడు.. ఇక మళ్లీ మిమ్మల్ని చూస్తానో లేదో అని ప్రేక్షకుల వంక చూస్తూ పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓటమి బాధతో దిగాలుగా మైదానంలో కూర్చిండిపోయిన దిగ్గజ ఆటగాడిని అలా చూసి స్పెయిన్ ఫార్వర్డ్ లామినె యమల్ (Lamine Yamal) మనసు తరుక్కుపోయింది. సహచరులతో సంబురాలను వదిలేసి మెస్సీ దగ్గరకు వచ్చి హత్తుకొని ఓదార్చాడు యమల్. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇరుజట్లు నిర్ణీత సమయంలో గోల్ చేయకపోవడంతో ఉత్కంత నెలకొంది. అయితే 109వ నిమిషంలో ఫెర్రాన్ టోరెస్ మెరుపు గోల్‌తో స్పెయిన్ చిరస్మరణీయ విజయం(1-0)తో రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది.
🌟 𝗧𝗛𝗥𝗘𝗘 𝗙𝗜𝗡𝗔𝗟𝗦, 𝗢𝗡𝗘 𝗟𝗘𝗚𝗔𝗖𝗬
A look at how Lionel Messi finished in each of the three FIFA World Cup finals he played. 🌎👑
No matter how the results unfolded, his World Cup legacy will always be remembered. 🇦🇷🐐💫#LionelMessi #Argentina #FIFAWorldCup #GOAT pic.twitter.com/FRb3cxmODq
— Sportskeeda Football (@skworldfootball) July 20, 2026