Messi – Suarez | ఆ ఇద్దరూ మళ్లీ కలిశారు.. మరోసారి మ్యాజిక్ చేస్తారా..?
Messi - Suarez : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi), స్టార్ ఆటగాడు లూయిస్ సూరజ్(Luis Suarez) మళ్లీ కలిశారు. ఒకప్పుడు బార్సిలోనా(Barcelona) తరఫున పలు ట్రోఫీలు కొల్లగొట్టిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఇంటర్ మియామి (Inter Miami) క్లబ్ ఆటగాళ్లుగా...
Messi – Suarez : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi), స్టార్ ఆటగాడు లూయిస్ సూరజ్(Luis Suarez) మళ్లీ కలిశారు. ఒకప్పుడు బార్సిలోనా(Barcelona) తరఫున పలు ట్రోఫీలు కొల్లగొట్టిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్ ఆటగాళ్లుగా బరిలోకి దిగుతున్నారు. మేజర్ సాకర్ లీగ్ ప్రీ సీజన్ శిక్షణ సందర్భంగా మెస్సీ, సూరజ్ ప్రాక్టీస్ చేస్తూ కెమెరా కంట పడ్డారు.
ప్రశాంతంగా కనిపించే మెస్సీకి దూకుడుకు మారుపేరైన సూరజ్ తోడైతే ఇక ప్రత్యర్థులకు హడలే అని ఫుట్‌బాల్ విశ్లేషకులు అంటున్నారు. ఇంటర్ మియామి తరఫున మెస్సీకి ఇది రెండో సీజన్ కాగా.. సూరజ్‌కు ఇదే తొలి సీజన్. సూరజ్ రాకతో ఈ క్లబ్లో బార్సిలోనా మాజీ ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. జోర్డి అల్బా, సెర్గియో బస్కెట్స్ ఇప్పటికే మియామికి ఆడుతున్నారు.
We’re back 👋🏠 pic.twitter.com/qVSc22fyWP
— Inter Miami CF (@InterMiamiCF) January 13, 2024
మెస్సీ, సూరజ్‌లు ఆరు సీజన్లు బార్సిలోనాకు ప్రాతినధ్యం వహించారు. 2014 నుంచి 2021 వరకు ఆ క్లబ్‌తో కొనసాగిన ఈ ఇద్దరూ పలు టోర్నీల్లో దుమ్మురేపారు. దాంతో, బార్సిలోనా క్లబ్ నాలుగు స్పానిష్ లీగ్స్ టైటిళ్లతో పాటు 9 ఇతర ట్రోఫీలు గెలిచింది.
Messi and Suàrez back at training together again 🥺 pic.twitter.com/LU4Hfp7YjR
— B/R Football (@brfootball) January 13, 2024
కొత్త ఏడాది మొదలయ్యే తొలి సీజన్ సన్నాహకాల్లో భాగంగా ఇంటర్ మియామి క్లబ్ జనవరి 19న సాల్వడారో జాతీయ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌తో మియామి క్లబ్ వరల్డ్ టూర్ 2024 షురూ కానుంది. అనంతరం మెస్సీ బృందం సౌదీ అరేబియా, చైనా, జపాన్ పర్యటనకు వెళ్లనుంది.
బార్సిలోనాకు ఆడే రోజుల్లో మెస్సీ, సూరజ్

ప్రీ సీజన్ పర్యటనలో మెస్సీ జట్టు ఫిబ్రవరి 1న క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) నేతృత్వంలోని అల్ నస్రీ(Al Nassr)తో తలపడనుంది. ఇక ప్రతిష్ఠాత్మక మేజర్ సాకర్ లీగ్ ఫిబ్రవరిలో జరుగనుంది. తొలి పోరులో ఇంటర్ మియామి.. రియల్ సాల్ట్ లేక్ టీమ్‌ను ఢీ కొననుంది.
ఇవి కూడా చదవండి
- Mohammad Rizwan | పొట్టి క్రికెట్లో సిక్సర్ల మోత.. పాక్ వైస్ కెప్టెన్ సరికొత్త రికార్డు
- దారుణం : స్కూల్ పిల్లలతో ఇంటి పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

