WBBL 2023 | 29 పరుగులకే ఆలౌట్.. బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ చెత్త రికార్డు
WBBL 2023 | మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెగ్ లానింగ్ సారథ్యంలోని మెల్బోర్న్ స్టార్స్.. 29 పరుగులకే ఆలౌట్ అయింది.
WBBL 2023 | మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెగ్ లానింగ్ సారథ్యంలోని మెల్బోర్న్ స్టార్స్.. 29 పరుగులకే ఆలౌట్ అయింది. టీమ్ మొత్తం స్టార్ ప్లేయర్లతో నిండి ఉన్నా ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ల ధాటికి మెల్బోర్న్ బ్యాటర్లు క్రీజులో నిలిచేందుకు తంటాలుపడ్డారు. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో ఇదే అత్యల్ప స్కోరుకావడం గమనార్హం.
ఈనెల 19న మొదలైన ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో భాగంగా తమ రెండో మ్యాచ్ ఆడుతున్న మెల్బోర్న్.. అన్నిరంగాలలో విఫలమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగుల భారీ స్కోరుచేసింది. క్యాటీ మాక్ (86), లారా వోల్వార్డ్ట్ (47)లు తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించారు. కెప్టెన్ తహిలా మెక్‌గ్రాత్ (34) ధాటిగా ఆడింది.
అనంతరం లక్ష్య ఛేదనలో మెల్బోర్న్ ఏ దశలోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. ఓపెనర్ సోఫీ డంక్లీ (9) ఒక్కతే ఉన్నవారిలో బెటర్ స్కోరు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (1), అలీస్ క్యాప్సీ (2), అన్నాబెల్ (1), మాలా బౌచర్ (౦), నికోల్ ఫాల్తుమ్ (1) , కిమ్ గార్త్ (1) లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సఫారీ బౌలర్లలో మేగన్ షుట్, అమందా వెల్లింగ్టన్ లు తలా 3 వికెట్లు తీశారు. కెప్టెన్ తహిలా మెక్‌గ్రాత్, ముషంగ్వేలు తలా రెండు వికెట్లు తీశారు. 9.3 ఓవర్లకే మెల్బోర్న్ ఖేల్ ఖతం అయింది.
Lowest total in women’s T20s
(full-member T20Is + franchise leagues)29 – Melbourne Stars v Adelaide Strikers, TODAY
30 – Bangladesh v Pakistan, 2018
32 – Bangladesh v New Zealand, 2022
43 – West Indies v England, 2022
44 – Bangladesh v Pakistan, 2016pic.twitter.com/E2BmrPzpCI— Kausthub Gudipati (@kaustats) October 21, 2023
తద్వారా ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో అత్యల్ప స్కోరు నమోదుచేసిన జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. 2017లో బ్రిస్బేన్ హీట్ జట్టు ఇదే మెల్‌బోర్న్‌పై 66 పరుగులకే ఆలౌట్ అవడమే ఇప్పటిదాకా ఉమెన్స్ బిగ్‌బాష్‌లో లోయెస్ట్ టోటల్. అంతర్జాతీయ క్రికెట్లో చూసుకుంటే మాలి జట్టు.. మరీ దారుణంగా ఆరు పరుగులకే (2019లో బంగ్లాదేశ్ ప్రత్యర్థి) కుప్పకూలింది. మాల్దీవ్స్ కూడా రెండుసార్లు 6, 8 పరుగులకే ఆలౌట్ అవగా ఉగాండా జట్టును మాలి టీమ్ ను 2019లో 10 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే ఇవన్నీ అసోసియేట్ జట్లు కాగా బంగ్లాదేశ్ జట్టును 2018లో పాకిస్తాన్ మహిళా జట్టు 30 పరుగులకే కట్టడిచేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

