MI vs UPW : యూపీ వారియర్స్(UP Warriorz) ఒకే ఓవర్లో బిగ్ వికెట్లు కోల్పోయింది. సాయిక్ ఇషాక్ (Saika Ishaque) బౌలింగ్‌లో తహ్లియా మెక్‌గ్రాత్ (50) స్టంపౌట్ అయింది. ఓపెనర్ హేలీ (58) ఎల్బీగా ఔట్ అయింది. తొలి బంతికి సింగిల్ తీసి మెక్‌గ్రాత్ అర్ధ శతకం పూర్తి చేసుకుంది. ఆమె 36 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించింది. ఓపెనర్ అలిసా హేలీ(50)తో కలిసి మెక్‌గ్రాత్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించింది. మూడో వికెట్‌కు వీళ్లు 61బంతుల్లో 82 రన్స్ చేశారు. ఆ జట్టు 17 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 144 రన్స్ చేసింది. సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్ క్రీజులో ఉన్నారు. కిరణ్ నవ్గరే(17) రెండో వికెట్‌గా వెనుదిరిగింది.