DC vs UPW | మెక్‌గ్రాత్ దంచింది.. ఢిల్లీ టార్గెట్ 139
wpl 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు సత్తా చాటారు. దాంతో, యూపీ వారియర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 6 వికెట్ల నష్టానికి యూపీ 138 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో తహ్లియా మెక్‌గ్రాత్(58) అర్ధ శతకంతో రాణించింది.
DC vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు సత్తా చాటారు. దాంతో, యూపీ వారియర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 6 వికెట్ల నష్టానికి యూపీ 138 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో తహ్లియా మెక్‌గ్రాత్(58) అర్ధ శతకంతో రాణించింది. ఆమె చివర్లో ధాటిగా ఆడడంతో యూపీ 130 ప్లస్ స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అలిసే క్యాప్సే మూడు, రాధా యాదవ్ రెండు వికెట్లు తీశారు. జెస్ జొనాసెన్‌కు ఒక వికెట్ దక్కింది.
మెక్‌గ్రాత్ వీర బాదుడు
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన యూపీకి ఓపెనర్లు అలిసా హీలీ (36), శ్వేతా షెరావత్(19) శుభారంభం ఇచ్చారు. 30 రన్స్ వద్ద శ్వేత ఔటయ్యింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో యూపీ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు. కిరణ్ నవగిరే (2), సిమ్రాన్ షేక్ (11) విఫలం అయ్యారు. 16వ ఓవర్ తర్వాత మెక్‌గ్రాత్ గేర్ మార్చింది. కానీ, అలిసే క్యాప్సే వేసిన 18వ ఓవర్లో సోఫీ ఎకిల్‌స్టోన్(0), దీప్తి శర్మ(2) స్టంపౌట్ అయ్యారు. దాంతో, 105 పరుగులకే ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే.. క్యాప్సే వేసిన 20వ ఓవర్లో మెక్‌గ్రాత్ సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 30 బంతుల్లోనే అర్ధ శతకం సాధించింది. ఆఖరి బంతికి ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. ఆమె 32 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 58 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

