SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
SA vs AUS : ఆద్యంతం రసవత్తరంగా సాగుతున్న డర్బన్ టెస్టులో వరల్డ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా (South Africa) పోరాడుతోంది. ఆస్ట్రేలియా(Australia) నిర్దేశించిన భారీ ఛేదనలో సఫారీ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
SA vs AUS : ఆద్యంతం రసవత్తరంగా సాగుతున్న డర్బన్ టెస్టులో వరల్డ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా (South Africa) పోరాడుతోంది. మ్యాట్ రెన్షా(190, 82) సూపర్ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా(Australia) నిర్దేశించిన భారీ ఛేదనలో సఫారీ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఎడెన్ మర్క్రమ్(45 నాటౌట్), బడింగమ్(46) క్రీజునంటుకున్నా.. కెప్టెన్ తెంబ బవుమా(1), స్టబ్స్ (1)లు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో.. ఆతిథ్య జట్టు విజయానికి 319 పరుగులు అవసరమవ్వగా.. ఐదో రోజు ఆరు వికెట్లు తీస్తే ఆసీస్‌దే గెలుపు. వరల్డ్‌క్లాస్ బౌలింగ్ దళాన్ని కాచుకొని ప్రొటీస్ ఆటగాళ్లు నిలబడతారా? అనేది ఆసక్తి రేపుతోంది.
స్వదేశంలో తడబడుతున్న దక్షిణాఫ్రికా డర్బన్ టెస్టును కాపాడుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆసీస్ నిర్దేశించిన 421 పరుగుల ఛేదనలో టాపార్డర్ విఫలమైనా.. ఎడెన్ మర్క్రమ్(45) నిలబడ్డాడు. ఓపికగా ఆడుతూ భాగస్వామ్యాలు నెలకొల్పడంతో సఫారీ జట్టు కోలుకుంది. కానీ, ఆసీస్ పేసర్లు చకచకా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ఫలితంగా నాలుగో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 102 రన్స్ చేసింది దక్షిణాఫ్రికా. ఇంకా ఆ జట్టు విజయానికి 319 రన్స్ అవసరం.
The World Test champions need to concentrate, concentrate, and concentrate more
▶️ https://t.co/N2rZqPKKKJ https://t.co/JPT1r2DUZ3
— Cricinfo (@cricinfo) October 12, 2026
రెండో వికెట్‌కు 63
రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు ఆరంభం ఇవ్వాలనుకున్న ఓపెనర్ రియాన్ రికెల్టన్(2)ను హేజిల్‌వుడ్(2-20) వెనక్కి పంపి షాకివ్వగా డేవిడ్ బడింగమ్(46) జతగా మర్క్రమ్ రెండో వికెట్‌కు 63 రన్స్ జోడించాడు. కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని విడదీసిన హేజిల్‌వుడ్ మళ్లీ సఫారీలను దెబ్బకొట్టాడు. కాసేపటికే సారథి తెంబ బవుమా(1)ను రెన్షా, ట్రిస్టన్ స్టబ్స్(1)ను కమిన్స్ ఔట్ చేయడంతో చూస్తుండగానే 86 పరుగులకే నాలుగు పెద్ద వికెట్లు పడ్డాయి. అనంతరం మల్డర్(5 నాటౌట్) అండతో నాలుగో రోజును 102-4తో ముగించాడు మర్క్రమ్. సిరీస్‌లో బోణీ కొట్టేందుకు చివరిదైన ఐదో రోజు ఆతిథ్య జట్టుకు 319 రన్స్ అవసరమవ్వగా.. కమిన్స్ సేనకు ఆరు వికెట్లు కావాలంతే.
Stumps, Day 4! 🏏
What a day of Test cricket at Hollywoodbets Kingsmead! 🏟️
#TheProteas end the day on 102/4 after 41 overs, needing 319 more runs to win. 🇿🇦
Play resumes tomorrow at 09:30am on the final day of this opening Dafabet Test match.
#Unbreakable #SAvAUS https://t.co/QsBTsmiPY2
— Proteas Men (@ProteasMenCSA) October 12, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

