IPL 2023 | దంచికొట్టిన పూరన్, మన్కడ్.. ప్లే ఆఫ్ రేసులో నిలిచిన లక్నో
IPL 2023 : ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దంచికొట్టారు. ఆఖరి ఓవర్లో నికోలస్ పూరన్(44 నాటౌట్ : 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఫోర్ కొట్టడంతో లక్నో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. ప్రేరక్ మన్కడ్(64 నాటౌట్ : 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
IPL 2023 : ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దంచికొట్టారు. ఆఖరి ఓవర్లో నికోలస్ పూరన్(44 నాటౌట్ : 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఫోర్ కొట్టడంతో లక్నో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. ప్రేరక్ మన్కడ్(64 నాటౌట్ : 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడికి స్టోయినిస్(40)సహకారం అందించాడు. దాంతో, ఈజీగా 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆరో విజయం సాధించిన లక్నో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
భారీ లక్ష్య చేధనలో లక్నో ఓపెనర్లు కైల్ మేయర్స్(2) క్వింటన్ డికాక్(29) నిదానంగా ఆడారు. భువనేశ్వర్, ఫారుఖీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ రాలేదు. పవర్ ప్లేలో ఆ జట్టు వికెట్ నష్టానికి 30 పరుగులు చేసిందంతే. ఆ తర్వాత డికాక్, ప్రేరక్ మన్కడ్ జోరు పెంచారు. డికాక్ ఔటయ్యాక వచ్చిన స్టోయినిస్ ధనాధన్ ఆడాడు. అభిషేక్ శర్మ వేసిన 16వ ఓవర్లో స్టోయిన్ రెండు, పూరన్ మూడు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, మ్యాచ్ లక్నో వైపు మలుపు తిరిగింది.
https://t.co/cgBU4wiSkz pic.twitter.com/21pddjmqIA
— IndianPremierLeague (@IPL) May 13, 2023
రాణించిన క్లాసెన్, సమద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఫామ్‌లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్(47), అబ్దుల్ సమద్(37 నాటౌట్) రాణించడంతో లక్నో సూపర్ జెయింట్స్ ముందు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. యశ్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో సమద్ సిక్స్ బాదాడు. దాంతో, 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(7), అన్మోల్ప్రీత్ సింగ్(36) తక్కువకే ఔటయ్యారు. ఆదుకుంటాడనుకున్నరాహుల్ త్రిపాఠి(20) నిరాశపరిచాడు. ఒకే ఓవర్లో కృనాల్ పాండ్యా మరక్రం, గత మ్యాచ్ హీరో గ్లెన్ ఫిలిఫ్స్(0)లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. దాంతో హైదరాబాద్115 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్లాసెన్‌తో జత కలిసిన అబ్దుల్ సమద్() ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీళ్లిద్దరూ ఐదో వికెట్‌కు 58 రన్స్ జోడించారు. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, యుధ్వీర్ సింగ్, అవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

