FIFA Club World Cup | ట్రోఫీ ఎగరేసుకుపోయిన మాంచెస్టర్ సిటీ.. ఒకే ఏడాది ఐదు టైటిళ్లతో రికార్డు
FIFA Club World Cup : ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీ(Manchester City) మరో టైటిల్ కొల్లగొట్టింది. ప్రతిష్ఠాత్మక ఫిఫా క్లబ్ వరల్డ్ కప్(FIFA Club World Cup) చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం జరిగిన టైటిల్ పోరులో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన...
FIFA Club World Cup : ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీ(Manchester City) మరో టైటిల్ కొల్లగొట్టింది. ప్రతిష్ఠాత్మక ఫిఫా క్లబ్ వరల్డ్ కప్(FIFA Club World Cup) చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం జరిగిన టైటిల్ పోరులో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన మాంచెస్టర్ సిటీ 4-0తో ఫ్లుమినెన్స్(Fluminense)ను చిత్తుగా ఓడించింది.
మాంచెస్టర్ ఫార్వర్డ్ ప్లేయర్ జులియన్ అల్వరెజ్(Julian Alvarez) రెండు గోల్స్‌తో రాణించాడు. ఈ ఏడాది ఈ క్లబ్ రికార్డు స్థాయిలో ఐదో ట్రోఫీ అందుకోవడం విశేషం. అవును.. ఈ ట్రోఫీ విజయంతో ప్రీమియర్ లీగ్, ఎఫ్ఏ కప్(FA Cup), యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్, యూఈఎఫ్ఏ సూపర్ కప్(UEFA Super Cup) టైటిళ్లు గెలిచిన మొదటి ఇంగ్లీష్ జట్టుగా మాంచెస్టర్ సిటీ రికార్డు సృష్టించింది.
Champions.@ManCity | #ClubWC pic.twitter.com/ehswRF7INP
— FIFA World Cup (@FIFAWorldCup) December 22, 2023
ఇరుజట్ల మధ్య హోరామోరీగా జరుగుతుందనుకున్న ఫైనల్ కాస్త ఏకపక్షంగా సాగింది. ఆట మొదలైన నిమిషంలోనే మాంచెస్టర్ సిటీ ఫార్డర్డ్ జులియన్ అల్వరెజ్ గోల్ కొట్టాడు. దాంతో, షాక్ తిన్న ప్లుమినెన్స్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. కానీ, నినో 27వ నిమిషంలో, ఫిల్ ఫొడెన్ 72వ నిమిషంలో గోల్ చేయడంతో మాంచెస్టర్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక అల్వరెజ్ 88వ నిమిషంలో మరోసారి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో మాంచెస్టర్ సిటీ విజయం ఖాయమైపోయింది. మరోవైపు ఫ్లుమినెన్స్ ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్ కొట్టలేకపోయారు.
Champions.@ManCity | #ClubWC pic.twitter.com/ehswRF7INP
— FIFA World Cup (@FIFAWorldCup) December 22, 2023
‘మాంచెస్టర్ సిటీ క్లబ్ విజయం పట్ల ఎంతో గర్వపడతున్నా. మేము సాధించింది ఒక గొప్ప విజయం. ట్రోఫీ గెలవాలంటే ప్రపంచంలోని మేటి జట్టు అయి ఉండాలి. మాది అత్యుత్తమ జట్టు అని నిరూపించాం. మేము ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ట్రోఫీలు ముద్దాడిన మరొక టైటిల్ కోసం పోరాడుతూనే ఉంటాం’ అని కోచ్ పెప్ గార్డియోలా(Pep Guardiola) మ్యాచ్ అనంతరం అన్నాడు.
ఇవి కూడా చదవండి
- Pakistan | పాకిస్థాన్‌కు పెద్ద షాక్.. టెస్టు సిరీస్ మొత్తానికి దూరమైన మరో స్పిన్నర్
- Nelson Dilipkumar | లోకేష్ కనగరాజ్ బాటలో ‘జైలర్’ దర్శకుడు.. విషయం ఎంటంటే.?
- Mamata Banerjee | లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేయండి.. దీదీకి బీజేపీ సవాల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

