IPL | లక్నోదే లక్.. అవేశ్‌ఖాన్ అద్భుత ప్రదర్శనతో రాయల్స్‌కు షాక్
ఐపీఎల్లో మరో పోరు అభిమానులను ఊపేసింది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
- రాజస్థాన్‌పై ఉత్కంఠ విజయం
IPL | జైపూర్: ఐపీఎల్లో మరో పోరు అభిమానులను ఊపేసింది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో లక్నో పేసర్ అవేశ్‌ఖాన్ అద్భుతం చేశాడు. హెట్‌మైర్(12)ను ఔట్ చేసిన అవేశ్ 6 పరుగులే ఇచ్చుకుని లక్నోకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. దీంతో 181 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 178/5 కు పరిమితమైంది. యశస్వీ జైస్వాల్ (52 బంతుల్లో 74, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఫామ్‌ను కొనసాగించగా కెప్టెన్ రియాన్ పరాగ్ (39) మెరిశాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 14 ఏండ్ల చిన్నోడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత ఓవర్లలో 180/5 పరుగులు చేసింది. మార్క్మ్ (45 బంతుల్లో 66, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అయుశ్ బదోని (34 బంతుల్లో 50, 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
జైస్వాల్ జోరు
ఛేదనను రాజస్థాన్ ధాటిగా ఆరంభించింది. జైస్వాల్‌తో పాటు క్రీజులోకి వచ్చిన పాలబుగ్గల పసివాడు వైభవ్.. ఈ లీగ్‌లో తాను ఆడిన మొదటి బంతినే భారీ సిక్సర్ కొట్టాడు. శార్దూల్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని కవర్స్ దిశగా సిక్స్ బాదాడు. అవేశ్ బౌలింగ్‌లోనూ సిక్స్ కొట్టిన వైభవ్.. జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 85 పరుగులు జోడించి ఆ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. శార్దూల్ 3వ ఓవర్లో 4 ,6తో బాదుడు మొదలుపెట్టిన జైస్వాల్.. మార్క్మ్ ఓవర్లోనూ రెండు సిక్సర్లతో అలరించాడు. మార్క్మ్ 9వ ఓవర్లో దురదృష్టవశాత్తూ వైభవ్ స్టంపౌట్‌గా వెనుదిరిగగా రాణా (8) సైతం నిరాశపరిచాడు. కానీ తాత్కాలిక సారథి పరాగ్‌తో జతకలిసిన జైస్వాల్.. లక్నోకు ఎలాంటి అవకాశమివ్వలేదు. 31 బంతుల్లోనే ఈ సీజన్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖర్లో అవేశ్.. జైస్వాల్, పరాగ్‌ను ఔట్ చేయడంతో పాటు చివరి ఓవర్లోనూ రాయల్స్‌ను కట్టడి చేస్తూ లక్నోకు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిన రాయల్స్..ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
ఆదుకున్న మార్క్మ్,్ర బదోని
టాపార్డర్ బ్యాటర్లు విఫలమవడంతో లక్నో ఆరంభ ఓవర్లలోనే కష్టాల్లో పడింది. జోరు మీదున్న మిచెల్ మార్ష్ (4)ను మూడో ఓవర్లోనే ఆర్చర్ పెవిలియన్‌కు పంపి రాయల్స్‌కు తొలి బ్రేక్‌నిచ్చాడు. ఆరెంజ్ క్యాప్ వీరుడు నికోలస్ పూరన్ (11)ను సందీప్ శర్మ వికెట్ల ముందు బలిగొనగా కెప్టెన్ పంత్ (3) వైఫల్య ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగింది. 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో లక్నోను మార్క్మ్,్ర బదోని ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 76 రన్స్ జోడించారు. 31 బంతుల్లో మార్క్మ్ అర్ధశతకాన్ని పూర్తిచేశాక బ్యాట్ ఝుళిపించాడు. మరో ఎండ్‌లో బదోని కూడా వేగంగా ఆడాడు. అయితే ఈ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్, 4 సిక్సర్లు) మెరుపులతో లక్నో పోరాడగలిగే స్కోరును సాధించింది.
సంక్షిప్త స్కోర్లు:
లక్నో: 20 ఓవర్లలో 180/5 (మార్క్మ్ 66, బదోని 50, హసరంగ 2/31, తుషార్ 1/26)
రాజస్థాన్: 20 ఓవర్లలో 178/5 (జైస్వాల్ 74, పరాగ్ 39, అవేశ్‌ఖాన్ 3/37, మార్క్మ్1/18)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

